ఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎంగా ఎన్నికైన తర్వాత అతిషి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
‘‘ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్, నాకు గురు సమానులు అరవింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాపై విశ్వాసం ఉంచి.. కేజ్రీవాల్ నాకు చాలా పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఇలా చేయటం కేవలం ఆప్‌లో మాత్రమే సాధ్యం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నేను ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చా. మరే ఇతర పార్టీలో ఉన్నా బహుశా నాకు ఎన్నికల టిక్కెట్టు కూడా ఇచ్చేవారు కాదు. కానీ, కేజ్రీవాల్ నన్ను నమ్మి ఎమ్మెల్యేని, మంత్రిని చేశారు. ఈరోజు నాకు సీఎం బాధ్యతలు అప్పగించారు.
..కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం.కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంతో అది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. అరవింద్ కేజ్రీవాల్‌ను తిరిగి సీఎంగా ప్రజలు ఎన్నుకుంటారు. ఆయన ఎంత నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ను సీఎం చేస్తారు.అప్పటివరకు ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తాను. నాకు శుభాకాంక్షలు పూలదండలు వద్దు. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్, ఉచిత వైద్యం ఉండవు’’ అని అన్నారు.
#WATCH | Delhi: Atishi addresses the media for the first time after being elected as the leader of Delhi AAP legislative party and the new CM.
She says, "First of all, I would like to thank the popular CM of Delhi, AAP national convener and my guru - Arvind Kejriwal. He gave me… pic.twitter.com/kn9fVRILnx— ANI (@ANI) September 17, 2024
Comments
Please login to add a commentAdd a comment