![Delhi Election These 29 Seats Challenge for Three Parties](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/11/parties.jpg.webp?itok=UoOOJcq3)
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. పలు సీట్ల జయాపజయాలపై విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. రాజధానిలో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు, ఒకసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆ 29 స్థానాలు సవాలుగా నిలిచాయి.
విజయంలో పార్టీల వైఫల్యం
కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ(Congress, BJP, Aam Aadmi) పార్టీలు ఈ 29 స్థానాల్లో తమ ఉనికిని చాటుకోవడంలో విఫలమయ్యాయి. అందుకే ఈ సీట్లను గెలవలేకపోయాయి. అయితే ఈసారి ఆ మూడు పార్టీలు ఈ సీట్లను గెలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ స్థానాల్లోని కొన్ని సీట్ల టిక్కెట్లను ఆయా పార్టీలు కీలక నేతలకు కేటాయించాయి. ఇందుకోసం పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. మూడు ప్రధాన పార్టీలకు సవాలుగా నిలిచిన ఈ 29 సీట్లలో కాంగ్రెస్ 17 సీట్లలో తన ఖాతాను తెరవలేకపోయింది. బీజేపీ 12 సీట్లు గెలవలేకపోయింది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 29 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఈ సీట్లలోని మతియా మహల్(Matiya Mahal) సీటును ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ ఇప్పటివరకు గెలవలేకపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని రెండుసార్లు సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ విజయానికి అడ్డంకి
ఈ ప్రాంతం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి, ఐదుసార్లు ఇతర పార్టీల నుండి గెలిచారు. ఒకసారి ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా బాదర్‌పూర్ సీటును పలుమార్లు గెలుచుకున్న రాంవీర్ సింగ్ బిధురి అలియాస్ రామ్‌సింగ్ నేతాజీకి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచే అదృష్టం దక్కలేదు. అయితే ఆయన ఇతర పార్టీల టికెట్‌పై లేదా స్వతంత్ర అభ్యర్థి(Independent candidate)గా గెలవగలిగారు. ఢిల్లీలో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. బురారి, రిథాల, ముండ్కా, కిరాడి, రోహిణి, షాలిమార్ బాగ్, మాటియా మహల్, మోతీ నగర్, హరి నగర్, జనక్‌పురి, బిజ్వాసన్, సంగం విహార్, గ్రేటర్ కైలాష్, బదర్‌పూర్, కృష్ణ నగర్, గోకల్‌పూర్, కరవాల్ నగర్ సీట్లను గెలవలేకపోయింది. కాంగ్రెస్ విజయానికి ఈ సీట్లు పెద్ద అడ్డంకిగా నిలిచాయి.
విశ్వాస్ నగర్ సీటులో ఆప్‌కు అవిశ్వాసం
ఢిల్లీలో బీజేపీ సంస్థాగత నిర్మాణం బలంగా ఉంది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ, సుల్తాన్‌పూర్ మజ్రా, మంగోల్‌పురి, మాటియా మహల్, బల్లిమారన్, వికాస్‌పురి, న్యూఢిల్లీ, జంగ్‌పురా, డియోలి, అంబేద్కర్ నగర్, ఓఖ్లా, కొండ్లి, సీలంపూర్ తదితర 12 సీట్లను బీజేపీ ఇప్పటికీ గెలుచుకోలేకపోయింది. అలాగే న్యూఢిల్లీ, జంగ్‌పురా తదితర స్థానాలు బీజేపీకి ఆందోళన కలిగించే సిట్లుగా ఉన్నాయి. కాగా బీజేపీకి బలమైన కంచుకోటగా నిలిచిన విశ్వాస్ నగర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సవాలుగా నిలిచింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే విశ్వాస్ నగర్ సీటును దక్కించుకోలేకపోయింది. ఈ సీటుపై బీజేపీకి బలమైన పట్టు ఉంది. ఇది ఆప్‌కు పెను సవాల్‌గా నిలిచింది.
ఇది కూడా చదవండి: Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం
Comments
Please login to add a commentAdd a comment