
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి 2025, ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరగనుంది. కాగా అందరి దృష్టి షకుర్ బస్తీ సీటుపైనే నిలిచింది. ఈ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ కర్నైల్ సింగ్ కు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ సతీష్ లూత్రా కు టికెట్ ఇచ్చింది.
షకుర్ బస్తీ(Shakur Basti) అసెంబ్లీ స్థానం రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి. ఈ స్థానం 2013 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధీనంలో ఉంది. సత్యేంద్ర జైన్ ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచారు. ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ షకుర్ బస్తీ స్థానం నుండి సత్యేంద్ర జైన్‌ను ఎన్నికల బరిలో దింపింది. ఈయన బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ పై పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సీటుపై గట్టి పోటీ కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీష్ లూత్రా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీనివ్వనున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
2013 నుండి షకుర్ బస్తీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) గెలుచుకుంటూవస్తోంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎస్సీ వాట్స్‌ను 7,592 ఓట్ల తేడాతో ఓడించారు. నాటి ఎన్నికల్లో సత్యేంద్ర జైన్‌కు 51,165 ఓట్లు రాగా, ఎస్సీ వాట్స్‌కు 43,573 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి దేవ్ రాజ్ అరోరా 3,382 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్.. బీజేపీ అభ్యర్థి ఎస్సీ వాట్స్‌ను 3133 ఓట్ల తేడాతో ఓడించారు. నాటి ఎన్నికల్లో సత్యేంద్ర జైన్‌కు 51,530 ఓట్లు రాగా, బీజేపీ చెందిన ఎస్సీ వాట్స్‌కు 48,397 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. నాటి కాంగ్రెస్ అభ్యర్థి చమన్ లాల్ శర్మకు 4,812 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు