న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi AssemblyElections)ను దేశం మొత్తంలో జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందన్నారు. పేదలకు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో వందలమంది కార్పరేట్ వ్యక్తుల రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.
తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బీజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ‘‘ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే మీరు ఈ ఖర్చులను భరించగలరా?’ అని ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తమ పార్టీ పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి రూ.25వేల విలువైన లబ్ధి అందుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది.
ఇదీ చదవండి: తేనెకళ్ల మోనాలిసా ఇళ్లు ఇదే..
Comments
Please login to add a commentAdd a comment