పార్టీలు మారి.. పరాజితులయ్యారు | changed parties and were defeated in Delhi assembly elections | Sakshi
Sakshi News home page

పార్టీలు మారి.. పరాజితులయ్యారు

Published Sun, Feb 9 2025 4:56 AM | Last Updated on Sun, Feb 9 2025 4:56 AM

changed parties and were defeated in Delhi assembly elections

మొత్తం 25 మందిలో గెలిచింది 8 మందే 
 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీలు మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల  నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి. 

ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్‌ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్‌ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement