Rebels candidates
-
మహారాష్ట్రలో రెబల్స్ తలనొప్పి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియ ముగిసింది. మహాయుతి, మహావికా స్ అఘాడీకి రెబల్స్ సవాలుగా మారారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 10,900 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 5,949 నామినేషన్లు ఆమోదం పొందగా, 1,649 తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,302 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. నామినేషన్లను వాపసు తీసుకున్న వారిలో మహాయుతి, మహావికాస్ అఘాడీ తిరుగుబాటు నేతలు కూ డా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఐదుగురు తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. నామినేషన్లను వెనక్కి తీసుకోకుంటే చర్యలు తప్పవని మహాయుతి పార్టీలు కూడా రెబల్స్‌ను హెచ్చరించాయి. మహాయుతిలో తగ్గేదేలేదంటున్నారు..! బీజేపీ మాజీ ఎంపీ హీనా గవిత్ నందుర్బార్ జిల్లాలోని అక్కల్కువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శివసేన షిండే వర్గానికి చెందిన అమ్షియా పద్వీ మహాయుతి అధికారిక అభ్యర్థిగా ఉన్నారు. అయితే గవిత్ బరిలో నిలవడం మహాయుతికి తలనొప్పిని పెంచింది. మాహిమ్‌లో ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే నామినేషన్ వేశారు. అయితే, శివసేన షిండేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదా శరవంకర్‌కూడా పోటీకి దిగారు. ఇక్కడ అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మిత్రపక్షాలను కోరుతోంది. నాసిక్‌లోనూ తిరుగుబాటును ఆపడంలో మహాయుతి విఫలమైంది. మహాయుతి అధికారిక అభ్యర్థులపై నంద్‌గావ్ నుంచి సమీర్ భుజ్‌బల్, దేవ్లాలీ నుంచి రాజశ్రీ అహిర్రావ్, చాంద్వాడ్ నుంచి కేదా అహెర్ పోటీలో ఉన్నారు. భివాండి రూరల్ స్థానంలో శివసేన అభ్యర్థి శాంతారామ్ మోరేపై బీజేపీ రూరల్ యూత్ అధ్యక్షురాలు స్నేహా పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. పార్టీలు ఒత్తిడి చేసినప్పటికీ రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదు. కల్యాణ్ ఈస్ట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సులభ గణపత్ గైక్వాడ్‌ను ప్రకటించిన తర్వాత, శివసేనకు చెందిన మహేష్ గైక్వాడ్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మందా మత్రేని బేలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించగా... ఇక్క స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన విజయ్ నహతా రెబల్‌గా బరిలో ఉన్నారు. ఐరోలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గణేష్ నాయక్‌పై శివసేన షిండే వర్గానికి చెందిన విజయ్ చౌగులే నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. శివాజీనగర్‌లో మహాయుతి అనుకోని సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఎన్సీపీ (అజిత్ వర్గం) నవాబ్ మాలిక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఇక్కడ శివసేన(షిండే)కు చెందిన సురేష్ కృష్ణ పాటిల్‌ను కూటమి అధికారిక అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఆశిష్ షెలార్ సహా పలువురు బీజేపీ నేతలు మాలిక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఎంవీఏలోనూ ఇదే తీరు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని చాలా మంది తిరుగుబాటు నాయకులు ఎన్నికలకు ముందు తమ నామినేషన్లను వాపసు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పుణేలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. శివాజీనగర్, పార్వతి స్థానాల్లో కాంగ్రెస్, కస్బాపేట్ స్థానంలో ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేస్తోంది. కొప్రి పచ్‌పాఖాడీలో కాంగ్రెస్ రెబల్స్ ఠాక్రే వర్గాన్ని ఎదుర్కొంటున్నారు. భివాండీ వెస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. కోప్రి పచ్‌పాఖాడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే బృందం కేదార్ దిఘేను నామినేట్ చేయగా... కాంగ్రెస్‌కు చెందిన మనోజ్ షిండే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు భివాండీ వెస్ట్ స్థానం నుంచి దయానంద్ చోర్గేను కాంగ్రెస్ నిలపగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రియాజ్ అజ్మీ స్వతంత్రునిగా నామినేషన్ వేయడం గమనార్హం. -
Haryana Assembly Elections 2024: రెబెల్స్ దడ
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది. 20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావంఅయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు. 15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి హిసార్ పైనే.. బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు. కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు. బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం. కాంగ్రెస్‌కూ సెగ.. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్పాల్కు అడ్వాంజేట్గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Himachal Pradesh Assembly elections 2022: రెబెల్ సవాల్
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద అతి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో నియోజకవర్గాలు చిన్నవి. గెలుపు మార్జిన్లు కూడా తక్కువే. దీంతో ప్రతీ ఓటు కీలకమే. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో రెబెల్స్ ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు రెబెల్స్‌ను ఎదుర్కోవడానికి తమ సర్వశక్తుల్ని ధారపోయాల్సి వస్తోంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థుల్ని బుజ్జగించి నామినేషన్ వెనక్కి తీసుకోవడానికి రెండు పార్టీల అగ్రనాయకత్వం చాలా కృషి చేసింది. మాట వినని కొందరు నాయకుల్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ చాలా స్థానాల్లో రెబెల్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇరు పార్టీలకూ డేంజర్‌బెల్స్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 29న ముగిసిన తర్వాత కాంగ్రెస్‌కు 12 స్థానాల్లోనూ, బీజేపీకి 20 స్థానాల్లోనూ రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. పచ్చడ్, అన్ని, థియోగ్, సులాహ్, చౌపల్, హమీర్పూర్, అర్కి స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్ ముప్పు పొంచి ఉంటే, బీజేపీకి మండి, బిలాస్పూర్, కాంగ్రా, ధర్మశాల, ఝాండూటా, చంబా, డెహ్రా, కులు, నలగఢ్, ఫతేపూర్, కిన్నూర్, అన్ని , సుందర్‌నగర్, నచన్, ఇండోరాలో రెబెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ► అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన గంగూరామ్ ముసాఫిర్ పచ్చడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దయాల్ ప్యారీపై పోటీ పడుతూ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ► థేగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబెల్ నాయకులు విజయ్ పాల్ ఖాచి, ఇందు వర్మ కంటి అధికారిక అభ్యర్థి కుల్ దీప్ సింగ్ రాథోడ్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ► హమీర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి ఆశిష్ శర్మ, బీజేపీకి నరేష్ దార్జి తిరుగుబాటు అభ్యర్థులు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ► కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సొంత నియోజకవర్గం అర్కిలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన రాజేందర్ ఠాకూర్‌కు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రెబెల్‌గా పోటీ పడుతున్నారు. ► బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తేజ్వంత్ సింగ్ నేగి (కిన్నూర్), మనోహర్ ధిమన్ (ఇండోరా), కిశోర్ లాల్ (అన్ని), ఎల్ ఠాకూర్ (నలగఢ్), కృపాల్ పర్మార్ (ఫతేపర్) ఇప్పుడు రెబెల్ అభ్యర్థుగా మారి ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు. ► కులులో రాచ కుటుంబానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ కుమారుడు, హితేశ్వర్ సింగ్ రెబెల్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. 5% ఓట్లు రెబెల్స్కే..! గత కొద్ది ఏళ్లుగా ఎన్నికల ఫలితాల తీరు తెన్నుల్ని పరిశీలిస్తే గెలిచిన పార్టీకి, ఓడిపోయిన పార్టీకి మధ్య 5% ఓటింగ్ తేడా కనిపిస్తుంది. దీనికి రెబెల్స్ ప్రధాన కారణం. పార్టీ గెలుపోటములను తమ గుప్పిట్లోకి తీసుకొని శాసించే స్థాయిలో రెబెల్స్ ఉండే ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కావడం విశేషం. పార్టీ కంటే అభ్యర్థే కీలకం హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను చాలా నియోజకవర్గాల్లో వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దీంతో ఈ రాష్ట్రంలోని ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థే కీలకంగా ఉంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’ సంక్షోభం: షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు. ప్రస్తుతం తనపై పలు ఆరోపణలు చేస్తున్న ఏక్నాథ్ షిండే కోసం తాను అన్నీ చేశానని ఉద్ధవ్ తెలిపారు. ‘ఏక్నాథ్ షిండే కుమారుడు శివసేనకు చెందిన ఎంపీ, నేను అతని కోసం అన్నీ చేశాను. నాకు ఉన్న శాఖను కూడా షిండేకు కేటాయించారు. అయినప్పటికీ ఏం ఆశించి షిండే నాపై అనేక ఆరోపణలు చేస్తున్నాడో తెలియడం లేదని’ అన్నారు. బాలాసాహెబ్ తనని ప్రేమించిన దానికంటే శివసేననే ఎక్కువగా ప్రేమించేవాడని ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి అన్నారు. తాను అసమర్ధుడినని కార్యకర్తలు అనుకుంటే, పదవిపై తనకు వ్యామోహం లేదని శివసేన పార్టీని కార్యకర్తలే ముందుకు నడిపించవచ్చని అయన చెప్పారు. మరో వైపు శుక్రవారం సాయంత్రం మాతోశ్రీ (ఠాక్రే నివాసం)లో ఎన్సీపీ నాయకులు సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు. -
బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ నాలుగు స్థానాల్లో అసమ్మతిని ఎదుర్కొంటోంది. పనాజీ, మాండ్రేమ్, సంగూమ్, కుంభర్జువా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు కమలం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల బీజేపీని వీడిన ఉత్పల్ పారికర్ ప్రతిష్టాత్మక పణజి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న అటానాసియో మోన్సెరట్టెపై ఆయన పోటీ చేస్తున్నారు. మాండ్రెమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీకి తిరుగుబాటు తప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే కమలం గూటికి నుంచి బయటకు వచ్చారు. 2017లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఓడించిన దయానంద్ సోప్టేపై ఆయన బరిలోకి దిగుతున్నారు. 2019లో దయానంద్ అధికార బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. (చదవండి: ప్రధాన పార్టీలకు.. వలసల దెబ్బ) సంగెం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేలార్ భార్య సావిత్రి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమె.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీకి రెడీ అయ్యారు. సంగెం స్థానానికి ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి నిలబడ్డారు. కుంభార్జువా నియోజకర్గంలోనూ కాషాయ పార్టీకి తిరుగుబాటు తప్పలేదు. రోహన్ హర్మల్కర్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాండురంగ్ మద్కైకర్ భార్య జైనితా మద్కైకర్పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కుమారుడు సిద్ధేష్ నాయక్‌ను బీజేపీ శాంతింపజేయడంతో కొంతలో కొంత ఊరట. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. (చదవండి: పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి) -
రెబెల్స్ తిరుగుబావుటా.. పార్టీలకు కొత్త చిక్కులు
సాక్షి,సిటీబ్యూరో: నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీ అభ్యర్థుల విజయానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తా, 6గంటలకు మూసాపేట చిత్తారమ్మతల్లి చౌరస్తా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాత్రి 7 గంటలకు ఐడీపీఎల్ చౌరస్తా, 8 గంటలకు సాగర్ హోటల్ జంక్షన్లో నిర్వహించనున్నారు. చదవండి: కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ మోత మోగింది. కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులంతా తిరుగుబావుటా ఎగురేశారు. దీంతో పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. టీఆర్ఎస్ ప్రకటించిన 150 మంది జాబితాలో సుమారు 26 ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిత్వాలు ఆశిస్తూ పలు డివిజన్లలో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థులను కాదని కొత్తవారికి టికెట్లు ఇచ్చిన డివిజన్లలో భారీగానే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నగర మేయర్ బొంతు రాంమోహన్ సతీమణి శ్రీదేవి రంగంలోకి దిగిన చర్లపల్లి డివిజన్లో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. సిట్టింగ్ కార్పొరేటర్లు మౌలాలి హెచ్‌బీ కాలనీలో గొల్లూరి అంజయ్య, తార్నాకలో ఆలకుంట సర్వస్వతి, హైదర్‌నగర్‌లో జానకిరామరాజులు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండగా, వెంగళరావునగర్‌లో సిట్టింగ్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఖైరతాబాద్, రాంనగర్, అడిక్‌మెట్, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలోనూ టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. ముగిసిన జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ బీజేపీలో అయోమయం... నామినేషన్లు గడువు ముగిసినా..బీజేపీలో అయోమయం కొనసాగుతోంది. బీజేపీకి స్థానబలం ఉన్న గోషామహల్ నియోజకవర్గంలో తామే బీజేపీ అభ్యర్థులమంటూ కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు చేశారు. జాంబాగ్ సిట్టింగ్ కార్పొరేటర్ శంకర్‌యాదవ్ సీటు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా జాంబాగ్‌లో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఇక్కడ ఏకంగా ఏడుగురు తామే బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా, గన్‌ఫౌండ్రిలో 13 మంది, గోషామహల్లో 12, బేగంబజార్‌లో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు–నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పెద్ద ఎత్తున వివాదం సాగుతోంది. ఇక ముషీరాబాద్‌లోనూ పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. అంబర్‌పేట, కాచిగూడ, రాంనగర్, ముషీరాబాద్, బోలక్పూర్లలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. తాము కోరుకున్న అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వకపోతే టీఆర్ఎస్లో చేరుతామని అల్టిమేటం జారీ చేశారు. ముషీరాబాద్‌లో బీజేపీ అసంతృప్తులందరినీ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం టీఆర్ఎస్లో చేరిపోయారు. బుజ్జగింపులకు ప్రత్యేక బృందాలు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలలోగా తిరుగుబాటు అభ్యర్థుల ఉపసంహరణ, బీ ఫారం సమర్పించేందుకు అవకాశం ఉండటంతో టీఆర్ఎస్, బీజేపీ బృందాలు బుజ్జగింపులు మొదలుపెట్టాయి. ఇప్పటికే నగరంలో రాష్ట్ర మంత్రులు పలువురు డివిజన్లలో పర్యటనలు ప్రారంభించి శుక్రవారం సాయంత్రం నుండి తిరుగుబాటుదారులతో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. బీజేపీ సైతం అసంతృప్తులను బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది. భారీగానే బంధుగణం గ్రేటర్ ఎన్నికల్లో బంధుగణం మళ్లీ భారీగానే రంగంలోకి దిగింది. అత్యధికంగా అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్నకు హబ్సిగూడ నుంచి రెండోసారి చాన్స్ రాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యకు అడిక్‌మెట్ నుంచి అవకాశం దక్కింది. కొత్తగా నగర మేయర్ బొంతు రాంమోహన్ పోటీ నుండి తప్పుకుని తన భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్ నుండి పోటీకి దించారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సతీమణి పద్మ ఈ మారు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇక ఎంపీ కేశవరావు కూతురు విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమీప బంధువు సునరిత మూసారంబాగ్ నుంచి, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి అల్వాల్ నుంచి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రాంనగర్ నుంచి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ సమీప బంధువులు పారిజాత కుత్బుల్లాపూర్, పద్మను జీడిమెట్లలో రెండోసారి కొనసాగించారు. గతంలో మాదిరిగానే మాదాపూర్, హఫీజ్‌పేటలో భార్యాభర్తలు జగదీశ్వర్‌గౌడ్, పూజితలు మళ్లీ పోటీలో నిలిచారు. -
మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ ‘సింహం’!
సాక్షి, కరీంనగర్: జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1939లో కాంగ్రెస్‌లో విలీనమైంది. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్, చిత్త బసులు పశ్చిమబెంగాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేసి, వామపక్ష సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లారు. పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ప్రభుత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ కీలకంగా వ్యవహరించింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు సింహం. ఈ గుర్తుకు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఈ సింహం గుర్తు మీదే పోటీ చేయగా, పాతపట్నం నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2018లో రామగుండం నుంచి మళ్లీ కోరుకంటి చందర్ కూడా ఇదే గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించారు. చందర్ విజయంతో సింహానికి మరింత క్రేజీ వచ్చింది. కరీంనగర్‌కు చెందిన బండ సురేందర్‌రెడ్డి ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నుంచి టికెట్లు రాని నాయకులతో సింహగర్జన చేయిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ వందలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని పలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఏఐఎఫ్బీ నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. రామగుండంలో విజయంతో రాష్ట్రంలో డిమాండ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ కోరుకంటి చందర్ ‘సింహం’ గుర్తు మీద పోటీ చేశారు. మొదటిసారి ఓటమి చెందిననప్పటికీ, రెండోసారి ఘన విజయం సాధించారు. భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో సింహం గుర్తు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పాపులర్ అయింది. ఇదే ఊపుతో ఆ పార్టీ అధ్యక్షుడు జిల్లా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారు. పలు చోట్ల పోటీ చేసినప్పటికీ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఘనపురం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లిలో ఈ సింహం గుర్తు అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో పార్టీ సింబల్‌కు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి టికెట్టు ఆశించి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధిక శాతం ముందస్తు జాగ్రత్తగా ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి కూడా మరో సెట్ వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరువాత పాలమూరు, వరంగల్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింహం గుర్తుమీదే గెలవడంతో కోల్‌బెల్ట్ ఏరియాలో ఈ గుర్తుకు బహుళ ప్రాచుర్యం లభించించింది. దీంతో ఈసారి రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 45 చోట్ల ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్ కార్పొరేషన్లో 24 మందికి బీఫారాలు ఇచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, అమన్‌గల్, ఐజ, ఆలంపూర్ మునిసిపాలిటీల్లో జెడ్పీటీసీ వెంకటేశ్ ఆధ్వర్యంలో అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మొదలుకొని నిజామాబాద్, కోరుట్ల, రాయికల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి మునిసిపాలిటీల్లో కూడా అభ్యర్థులను నిలిపారు. అన్ని జిల్లాలకు విస్తరిస్తాం ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. మా పార్టీ నుంచే రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ గెలిచారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి సత్తా చాటాం. గెలిచిన వాళ్లు మాతోనే ఉన్నారు. ఈసారి మునిసిపాలిటీల్లో విజయాన్ని సాధించడం ద్వారా ఫార్వర్డ్‌బ్లాక్‌ను రాష్ట్రంలో విస్తరిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియాశీలక శక్తిగా ఎదుగుతాం. – బండ సురేందర్‌రెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బీజేపీ కూటమికి రెబెల్స్ బెడద
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఈ నెల 21న పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో సోమవారంతో నామినేషన్ గడువు ముగిసింది. బీజేపీ, శివసేనలు ఆఖరి నిమిషం వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 50కిపైగా చోట్ల 100 మందికి పైగా అభ్యర్థులు బీజేపీ–సేన కూటమికి సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 15–20 స్థానాల్లో రెబెల్స్ బెడద ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా వినే పరిస్థితి లేదు. రెబెల్స్‌ను శాంతింపజేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. -
మోగుతున్న రెబెల్స్
సాక్షి, విశాఖపట్నం: అసంతృప్తులు, అసమ్మతి సెగల మధ్య టీడీపీ టికెట్ల పంచాయతీ కొలిక్కి వచ్చింది.అయితే రెబల్స్ బెడద మాత్రం తప్పేలా లేదు. షెడ్యూల్ ప్రకటించినా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా చంద్రబాబు హైడ్రామా నడిపారు. దీంతో ఈ సారి పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి సీట్లు లభిస్తాయని అంతా భావించారు. తీరా సోమవారం అర్ధరాత్రి టికెట్లు కేటాయించిన చంద్రబాబు సిట్టింగ్‌లకే ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలో మాత్రం ఇంకా పార్టీలో చేరని సబ్బం హరికి కేటాయించడంతో చర్చాంశనీయమైంది. మరో వైపు ఈ సారి కూడా సిట్టింగ్‌లకే అవకాశం లభించడంతో పలు నియోజకవర్గాల్లో రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సీట్ల పంపిణీలో కొరవడినసామాజిక న్యాయం సీట్ల కేటాయింపులో పార్టీ అధినేత సామాజిక న్యాయం పాటించలేదని అధికార పార్టీ సీనియర్లే ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ సామాజిక వర్గీయులైన కాపులతో పాటు సింహ భాగంగా ఉన్న మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకే స్థానాన్ని మహిళకు కేటాయించారు. 11 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం కల్పించారు. అరుకు నుంచి మంత్రి కిడారి శ్రావణ కుమార్‌కు టికెట్ కేటాయించారు. మాడుగుల నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోని మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలి టికెట్ కేటాయించారు.రాజకీయాలతో సంబంధం లేని కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్యకు పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తొలి రెండు జాబితాల్లో చోటు దక్కక అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణమూర్తికి ఎట్టకేలకు మళ్లీ పెందుర్తి టికెట్ కేటాయించారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును విశాఖ ఎంపీకి పంపాలన్న యోచనతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన గాజువాక సీటు ను చివరి జాబితాలో పల్లాకే ఖరారు చేశారు. తొలుత పాతమిత్రుడు పవన్ కల్యాణ్ కోసం పల్లాను ఎంపీకి పంపి ఆ స్థానంలో డమ్మి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించారు. కానీ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లాకే ఆ సీటు కేటాయించారు.అయితే ఆయనకు రెబల్ బెడద తప్పేలా లేదు. భరత్‌కే విశాఖ లోక్‌సభ సీటు దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు ఎం.శ్రీభరత్‌కు విశాఖ లోక్‌సభ సీటు కేటాయించారు. ఈ టికెట్ విషయంలో దోబుచులాడిన చంద్రబాబు ఎట్టకేలకు వియ్యంకుడు బాలకృష్ణ ఒత్తిడితో భరత్‌కే ఇచ్చారు. మరో వైపు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌కు అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు. ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్‌కు అరుకు లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు. అభ్యర్థులకు రెబల్స్ గుబులు మెజార్టీ సీట్లన్నీ సిట్టింగ్‌లకే కేటాయించడంతో ఆశావాహులు అంసతృప్తితో రగిలిపోతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో పలువురు టీడీపీరెబెల్స్గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాయకరావుపేట టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మి రెబల్‌గా దిగేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. గాజువాక నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్లకోటేశ్వరరావు రెబెల్‌గా నామినేషన్ వేయనున్నారు. పార్టీలో కూడా చేరని మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత కోరాడ రాజబాబు టీడీపీకి రాజీనామా చేశారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం,పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు రెబెల్‌గా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి నరవ రాంబాబు రెబెల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధపడగా మంత్రి గంటా బుజ్జగించడంతో కాస్త మెత్తబడిన ప్పటికీ ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. పాడేరు నుంచి మాజీ మంత్రి మణికుమారి రెబల్‌గా బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరో వైపు చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్రాజు, మాడుగుల పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడుకు టికెట్లు ఇస్తే ఓడిస్తామని పార్టీలోనే సీనియర్లు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న కుమారుడు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ సోదరుడు సన్యాసిపాత్రుడు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. యలమంచలిలో పంచకర్ల రమేష్ బాబుకు వ్యతిరేకంగా పనిచేసేందుకు మిగిలిన నేతలు పావులు కదుపుతున్నారు. జిల్లా కాపులకుమొండిచేయి టీడీపీలో జిల్లాలోని కాపులకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 15 లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా స్థానిక కాపులకు కేటాయించకపోవడాన్ని పార్టీలోని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో పాతుకుపోయిన వలస నేతలైన ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు (కాపు),పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంచకర్ల రమేష్‌బాబులకు మాత్రమే సీట్లు కేటాయించారు. పార్టీలో జిల్లాకు చెందిన కాపునాయకులైన కశింకోట జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పార్టీ సీనియర్లు పినబోలు వెంకటేశ్వర్లు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సీతా వెంకటరమణ వంటి సీనియర్లు టికెట్లు ఆశించినా టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీలోని కాపులు అంతర్గతంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
అన్నా..జర నీ దయనే..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. వాటి పరిశీలన అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులెవరో గురువారం తేలనుంది. ఇప్పటికే బీఫాంతో నామినేషన్ వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రెబెల్‌గా నిలిచిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. తీరొక్క విధంగా నచ్చజెబుతూ.. బతిమిలాడుతూ.. బరి నుంచి తప్పించేం దుకు నానా పాట్లు పడుతున్నారు. ‘అన్నా.. జర నీ దయనే’ గెలిస్తే మనకు మంచి భవిష్యత్ ఉంటుందని.. పోటీ నుంచి తప్పుకోవాలని సర్ది చెబుతున్నారు. కలిసికట్టుగా పనిచేసి.. పార్టీ ప్రతిష్టను నిలబెడుతూ విజయం వైపు పయనిద్దామంటూ సూచిస్తున్నారు. సాక్షి,ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రతి అంశం కీలకం కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఓట్లు చీలడంతోపాటు బలమైన ప్రత్యర్థి గెలుపునకు దోహదపడే అవకాశం ఉండడంతో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా.. స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని బుజ్జగించేందుకు.. అనునయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వారిని ఒప్పించేందుకు.. మెప్పించేందుకు ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫజల్ అహ్మద్‌తో కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు సమావేశమై.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాములునాయక్ కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. టీఆర్ఎస్లోని అసంతృప్త వర్గం ఆయనకు తోడ్పాటు అందిస్తుండడంతో తాను రంగంలో ఉండి తీరుతానని రాములునాయక్ సొంత పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో అనేక మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బాణోత్ హరిప్రియ నామినేషన్ వేయగా.. తిరుగుబాటు అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, దళ్‌సింగ్, చీమల వెంకటేశ్వర్లు, కిషన్‌నాయక్ తదితరులు నామినేషన్లు వేశారు. వీరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇల్లెందులో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కు మెండుగా ఉన్న సమయంలో తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండడం పార్టీకి శ్రేయస్కరం కాదని, ప్రభుత్వం ఏర్పడితే అనేక అవకాశాలు వస్తాయని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో మాట్లాడేందుకు అవసరమైతే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అశ్వారావుపేటలో ప్రజాకూటమి ఎన్నికల పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో పలువురు ఇప్పటికే ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు బహిరంగ మద్దతు ప్రకటించగా.. నాగమణి మాత్రం ఎన్నికల బరిలో దిగడంతో ఆమెను బరిలో నుంచి తప్పించడానికి ఇటు టీడీపీ.. అటు కాంగ్రెస్ నేతలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ఓ ముఖ్య నేత ఆశీస్సులతో టికెట్ కోసం ప్రయత్నించిన సున్నం నాగమణి నామినేషన్ ఉపసంహరణకు సైతం ఆ ముఖ్య నేత ద్వారా నాగమణిని ఒప్పించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి బాణోతు విజయ నామినేషన్ దాఖలు చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా లాల్‌సింగ్ నామినేషన్ వేశారు. ఆయన చేత నామినేషన్ ఉపసంహరింప జేయడానికి సీపీఐ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పాలేరు వంటి స్థానాల్లో స్వతంత్రులు అత్యధికంగా నామినేషన్ దాఖలు చేయగా.. వారు ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేసేందుకు ఆయా పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. -
మూడింటా ముసలం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని నిర్ణయించారు. తాండూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుకు నిరాశే మిగిలింది. కొత్తగా పార్టీలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మహారాజ్ కుటుంబీకులు లేదా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలోనే పైలెట్‌కు టికెట్ రావడంతో కినుక వహించిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అంతే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టంచేయడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ సాబ్‌కు నిరాశే.. మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌కు టికెట్ కేటాయింపులో భంగపాటు తప్పలేదు. వికారాబాద్ సీటు తనకే దక్కుతుందని గంపెడాశతో ఉన్న ఆయనకు పార్టీ మొండిచేయి చూపింది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఈ స్థానం నుంచి బరిలోకి దింపడంతో చంద్రశేఖర్‌కు నిరాశే మిగిలింది. ఒకానొక దశలో వికారాబాద్ స్థానే చేవెళ్ల దక్కుతుందని భావించిన ఆయనకు.. అది కూడా రత్నం ఎగరేసుకుపోవడంతో రెంటికీచెడ్డ రేవడిలా తయారయ్యారు. ఈ పరిణామాలతో ఖిన్నుడైన చంద్రశేఖర్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మంగళవారం సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం గులాబీ గూటికి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో గులాబీ బాస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన చంద్రశేఖర్‌కు అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందో రాదో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పడాలాకు రిక్తహస్తమే.. చేవెళ్ల టికెట్‌పై కన్నేసిన సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామికి మరోసారి రిక్తహస్తమే మిగిలింది. గత నాలుగేళ్లుగా టికెట్ తనకు దక్కుతుందని భరోసాతో ఉన్న ఆయనకు కొత్తగా పార్టీలో చేరిన రత్నం రూపేణా దురదృష్టం వెంటాడింది. మాజీ మంత్రి సబితను నమ్ముకున్న ఆయనకు అధిష్టానం ఆశీస్సులు దక్కలేదు. రెండు నెలల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రత్నంకు టికెట్ కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అనుయాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో వెంకటస్వామికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టిన సీనియర్లు.. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వెంకటస్వామి మాత్రం ఈ అంశంపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు సమాచారం. -
మా దారి మాదే..
సాక్షి,సిటీబ్యూరో: మహా కూటమిలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించిన మొదటి జాబితాలో అవకాశం దక్కని అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏకంగా కొందరు నిరసనలు, అందోళనలకు దిగుతుండగా, ఇంకొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి ఇవ్వడాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు సర్దుబాటు చేయడం టీడీపీకి మింగుడు పడడంలేదు. ఇదిలాఉండగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకు, టీడీపీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖారారు చేయాల్సి ఉంది. కూటమి సీట్ల సర్దుబాటులో తెలంగాణ జనసమితి కూడా ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. శేరిలింగంపల్లిపై శ్రేణుల లొల్లి ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కేటాయించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి కేటాయించవద్దని ఇప్పటికే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఇందుకోసం కార్యకర్తలు ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు సైతం సిద్ధమయ్యారు. అయినప్పటకీ కూటమి సీట్ల సర్దుబాటులో టీడీపీ కోటా కింద కాంగ్రెస్ వదులుకోక తప్పలేదు. టీడీపీ తన మొదటి జాబితాలో శేరిలింగంపల్లి స్థానానికి తన అభ్యర్థిని ప్రకటించింది. ఇదీ కాంగ్రెస్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచించాలని, తనకు సీటు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని తాజా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో అనుచరులతో సమావేశమై కార్యాచరణపై సమాలోచనలు సైతం చేశారు. ఈ సీటు విషయంలో టీడీపీలో కూడా అసంతృప్తి రగులుతోంది. ఇక్కడ మొదటి నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పొటీపడుతున్నారు. అందులో ఒకరు పారిశ్రామికవేత్త వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ కాగా.. మరొకరు మొవ్వ సత్యనారాయణ. అయితే, ఆ పార్టీ మాత్రం తమ అభ్యర్థిగా వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌ను ఖరారు చేయడం ఇక్కడి టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. స్థానికేతరుడైన ఆనంద్‌కు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అధిష్టానంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎస్టీఆర్ ట్రస్ట్భవన్ వద్ద ధర్నా చేసి స్థానికేతరులకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అధిష్టానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకతప్పదని ‘మొవ్వ’ ప్రకటించారు. ముషీరాబాద్‌లోనూ అదే తీరు.. ఈ అసెంబ్లీ స్థానం విషయంపై ఇరు పార్టీల్లో ముసలం మొదలైంది. కాంగ్రెస్‌లో అసమ్మతి, టీడీపీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ పార్టీలో స్థానికేతరుడైన అభ్యర్థికి ఖరారు చేయడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మరోవైపు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు వదులుకోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అద్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌కు సైతం మొండి చేయి చూపించారు. దీంతో ఇక్కడి కార్యకర్తలు మంగళవారం నగర టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్ ఒత్తిడి మేరకు ఎమ్మెన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్లో అసమ్మతి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో అసమ్మతి చెల రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ బంధువైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సర్వేపై రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో అశావహుడు టీపీసీసీ కార్యదర్శి గణేష్ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘సర్వే’కు టికెట్ ఇవ్వడాన్ని గణేష్ అభిమానులు, పలువురు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పికెట్ చౌరస్తా వద్ద మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను సైతం తగలబెట్టారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు గణేశ్ ప్రకటించారు. టీఆర్ఎస్లోనూ ‘దానం’ కిరికిరి టికెట్ల ప్రకటనకు ముందే ఖైరతాబాద్‌లో ఆందోళన తారస్థాయికి చేరింది. ఈ స్థానాన్ని తనకే కేటాయించాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యాలయం నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో గోవర్ధన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఓ కార్యకర్త తలపై బండరాయితో మోదుకున్నాడు. దీంతో మరింత కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఖైరతాబాద్ సర్కిల్లో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన కొనసాగించారు. మంగళవారం రాత్రి వరకు కూడా గోవర్ధన్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. స్వతంత్రంగా పోటీకి ‘ఎమ్మెన్’ సిద్ధం సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడినప్పటికీ ఈసారి ముషీరాబాద్ టిక్కెట్ తమ పార్టీకే దక్కుతుందనుకున్న స్థానిక టీడీపీ నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననే ఆశతో ఎంతో కాలంగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. పంపకాల్లో ముషీరాబాద్‌ను కాంగ్రెస్‌కు కేటాయించడంతో నియోజకవర్గంలోని డివిజన్ల నేతలు, కార్యకర్తలు, జిల్లా నేతలు పార్టీ కార్యాలయంపై తమ ప్రతాపం చూపాలనే ఆలోచనలు చేసినప్పటికీ ఎమ్మెన్ వారించినట్లు తెలిసింది. నాలుగు రోజులు వేచిచూసి, అప్పటికీ పార్టీ తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే సోమవారం ‘స్వతంత్ర’ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని తన వర్గానికి నచ్చజెప్పారు. అందుకు తగ్గట్టు పార్టీ శ్రేణులు బూత్, డివిజన్ల వారీగా తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నగరంలో ఏపార్టీకి లేనిది తమకు 300 బూత్ కమిటీలు తమకున్నాయని, క్యాడర్ బలంగా ఉన్నా టీడీపీకి టికెట్ రాకపోవడం దారుణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హోరాహోరీ
ప్రధాన పార్టీల్లో రె‘బెల్స్’ తిరుగు‘బాట’లో పలువురు భారీగా నామినేషన్లు కిటకిటలాడినరిటర్నింగ్ కేంద్రాలు కొన్నిచోట్ల ఉద్రిక్తతలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం రక్తి కడుతోంది. అభ్యర్థుల వెల్లడిలో జాప్యం.. పొత్తు కుదరని స్థానాలు.. రాత్రికి రాత్రి పార్టీ గోడలు దూకేసిన అభ్యర్థులు.. క్షణాల్లో రంగు మారిన కండువాలు.. ఎవరు ఏ టికెట్‌పై పోటీ చేస్తున్నారో తెలియక అయోమయం.. రెండు రోజులుగా సాగిన గందరగోళ పరిణామాల మధ్య బుధవారం గ్రేటర్ రాజకీయ ముఖచిత్రంలో ఎట్టకేలకు స్పష్టత ఏర్పడింది. అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ గట్టిగా మోగాయి. ప్రధాన పార్టీలన్నీ తిరుగుబాట్లకు ఎదురీదక తప్పని పరిస్థితి నెలకొంది. చివరి రోజైన బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉన్నా.. అప్పటిలోగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థులంతా నామినేషన్లు పూర్తిచేసేందుకు రాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అభ్యర్థుల అభిమానులు, అనుచరులతో ఆయా ప్రాంతాల్లో హడావుడి కనిపించింది. నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి టికెట్లు పొందిన వారు, రెబల్స్ అభ్యర్థులు పోటాపోటీగా తరలి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇది ఆవేశకావేశాలకు దారి తీసింది. తిరుగు‘బాట’లో.. ఎల్బీనగర్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్.కృష్ణయ్యకు నామినేషన్ దాఖలు రోజునే గట్టి సెగ తగిలింది. ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడిన సామ రంగారెడ్డి అనుచరులు.. కృష్ణయ్య కారుపై కొబ్బరిబొండాలతో దాడి చేశారు. ‘కృష్ణయ్యా గోబ్యాక్’ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ నేత ఎస్వీ కృష్ణప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గోషామహల్ బీజేపీ టికెట్ రాజాసింగ్‌కు దక్కడంతో.. ఆ టికెట్ ఆశించిన నందకిశోర్‌వ్యాస్, రఘునందన్‌యాదవ్, రామస్వామి, గోవింద్‌రాఠి రెబల్స్‌గా నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ మిత్రపక్ష టీడీపీ నుంచి శీలం సరస్వతి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కని ఆర్వీ మహేందర్‌కుమార్.. ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరిన వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు చివరకు నిరాశే మిగలడంతో పెద్దసంఖ్యలో తన అనుచరులతో ఊరేగింపుగా వెళ్లి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గంపై ఎంతోకాలంగా ఆశలు పెంచుకున్న టీడీపీ నేతలు పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్‌యాదవ్ సైతం స్వతంత్రులుగా బరిలో దిగారు. కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ టికెట్ లభించని శోభాకృష్ణ అక్కడ తిరుగుబావుటా ఎగురవేశారు. ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ నుంచి బిఎన్‌రెడ్డి ప్రత్యర్థిగా పోటీకి దిగారు. డాక్టర్ వినయ్‌కుమార్ (ముషీరాబాద్-కాంగ్రెస్) అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ బీసీ సెల్ నేత న గేష్ ముదిరాజ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్, ఎన్.దశరథ్ స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ లభించని హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీష్‌గౌడ్ ప్రత్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనకు గతంలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులిస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఏదీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో తనకు అసెంబ్లీ టికెట్ ఖాయమని ఆయననమ్మారు. అదీ దక్కకపోవడంతో తిరుగుబావుటా ఎగురవేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మొవ్వా సత్యనారాయణ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐ (అజీజ్‌పాషా)కి కేటాయించారు. మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం నామినేషన్ వేయడం విశేషం. ఇంకా, చల్లా నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి కాంగ్రెస్ రెబెల్స్‌గా బరిలో నిలిచారు. అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రెబల్స్‌గా కాలేరు శ్రీనివాసరావు, అంగరెల్లి నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి అసెంబ్లీ టీడీపీ రెబల్స్‌గా శారదామహేశ్, సుమలతారెడ్డి సవాల్ విసురుతున్నారు. పటాన్చెరులో కాంగ్రెస్ రెబల్‌గా నగేశ్‌యాదవ్ బరిలో నిలిచారు. అన్ని పార్టీల్లో స్వతంత్రుల హవా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎంతో పాటు లోక్‌సత్తా, ఆమ్ఆద్మీ, బీఎస్పీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్, తెలంగాణ జాగిర్, జై సమైక్యాంధ్ర, టీఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ లోక్‌సత్తా పార్టీల నుంచీ పెద్దసంఖ్యలో నామినేషన్లు పడ్డాయి. వైఎస్సార్సీపీ గ్రేటర్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలో దింపింది. స్వతంత్ర అభ్యర్థులుగానూ పలువురు నామినేషన్లు వేశారు. గోడ దూకిన వారికి టికెట్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారి వెంటనే బీఫారాలు తెచ్చుకొని పోటీలో నిలిచిన వారూ తక్కువేం లేరు. టీడీపీకి చెందిన ముఠా గోపాల్, ప్రేంకుమార్దూత్, మురళిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరిలో మల్కాజిగిరి అసెంబ్లీని ఆశించిన మైనంపల్లి హన్మంతరావు, టీడీపీ నుంచి కాంగ్రెస్.. అక్కడి నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లి ఏకంగా మల్కాజిగిరి ఎంపీగా నిలిచారు. మిగతా వారికీ పార్టీల మార్పుతో తాము కోరుకున్న అసెంబ్లీ స్థానాల టికెట్లు లభించాయి.