న్యూఢిల్లీ: టికెటివ్వలేదనే అసంతృప్తితో శుక్రవారం ఆప్‌కు రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తమతోపాటు మరికొందరు ఆప్ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారని ఆప్ మాజీ ఎమ్మెల్యే విజేందర్ గర్గ్ చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఢిల్లీ ఇన్‌చార్జి బైజయంత్ పాండా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర సచ్‌దేవ వీరికి ఘన స్వాగతం పలికారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు పంపామని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆప్ ప్రాథమిక సభ్యత్వాలకు సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతాలను పక్కనబెట్టి, అవినీతిలో కూరుకుపోయిందని వీరు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment