60.44 శాతం పోలింగ్ నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిశాయి. బుధవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
రాష్ట్రపతి ద్రౌప దీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హ ర్దీప్‌సింగ్ పురి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంక గాం«దీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేజ్రీవాల్ తన తల్లిదండ్రులను చక్రాల కురీ్చల్లోపోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. మెరుగైన పరిపాలన కావాలంటే ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 60.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా నార్త్‌ఈస్టు జిల్లాలో 63.83 శాతం నమోదైనట్లు తెలియజేసింది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 66.68 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై తుది గణాంకాలు గురువారం బహిర్గతం కానున్నాయి. ఢిల్లీలో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62.59 శాతం, 2024 నాటి లోక్‌సభ ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 8న వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment