న్యూఢిల్లీ: ఉచిత పథకాల ప్రకటన అమెరికా వరకు వెళ్లాయంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రావాల్ పేర్కొన్నారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ చేసిన పోస్టును కేజ్రావాల్ రీట్వీట్ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైతే కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లా’ అని తెలిపారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం.. ప్రజలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఉచితాల పేరుతో ఆప్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తోంది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్ సమర్థించుకోవడమూ తెలిసిందే.
తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు
అంతేగాక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకివాల్ విసిరారు. నవంబర్‌లో జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే తమ సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment