పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో అని మాజీ మం త్రి పి.శంకర్రావు నినదించారు.
హైదరాబాద్: పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో అని మాజీ మం త్రి పి.శంకర్రావు నినదించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పరాజయానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్థతే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను పట్టించుకునే నేతలు తెలంగాణలో లేరని పోయారన్నారు. పీసీసీ అధ్యక్షునిగా తనను నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.