హస్తినకు పొన్నాల, రఘువీరా, చిరంజీవి | congress leaders visits delhi to brief sonia gandhi on poll debacle | Sakshi
Sakshi News home page

హస్తినకు పొన్నాల, రఘువీరా, చిరంజీవి

Published Mon, Jun 23 2014 10:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

హస్తినకు పొన్నాల, రఘువీరా, చిరంజీవి - Sakshi

హస్తినకు పొన్నాల, రఘువీరా, చిరంజీవి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తిన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కార్యనిర్వాహక అధ్యక్షుడు  ఉత్తమ్కుమార్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఘోర పరాజయంపై రఘువీరా, చిరంజీవి ఈ సందర్భంగా నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement