
సాక్షి, జనగామ: సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యక్తే కాదని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 1956కు ముందు కేసీఆర్ ఫూర్వీకులు తెలంగాణకు సెటిలర్స్‌గా వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. అలాంటిది ఇక్కడికి బతుకు దెరువు కోసం వచ్చిన వారినే జాగో.. బాగో అంటూ కేసీఆర్ తెలంగాణ వాడిగా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
మోసపూరిత రాజకీయ కుట్రలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అదే రీతిలో ఓటమిచెందక తప్పదని జనగామలో జరిగిన విలేఖరుల సమావేశంలో పొన్నాల ధ్వజమెత్తారు. కేసీఆర్ మూడవ ఫ్రంట్ మూన్నాళ్ల ముచ్చటేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment