ఐక్యతారాగం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘నువ్వా దరిని.. నేనీ దరిని’ అంటూ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం ఒకే వేదికపైకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరైన బోధన్ సభలో ఐక్యతారాగం వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు చేదు ఫలితాలు ఇచ్చినా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదన్న ఆపవాదును దూరం చేసే ప్రయత్నం చేశారు.
పార్టీ సభ్యత్వ నమోదు తీరుతెన్నులపై సమీక్షించేందుకు బోధన్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని విజయవం తం చేసేందుకు రెండు రోజులు బోధన్‌లోనే మకాం వేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అందరినీ ఒకే వేదికపైకి చేర్చేందుకు కృషి చేశారు.
డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ దిగ్గజాలు ఐక్యత రాగం వినిపించడం కార్యకర్తలలో చర్చనీయాంశంగా మారింది. శాసనమండలి విపక్షనేత డి. శ్రీనివాస్, ఉపనేత మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ సురేష్‌కుమార్ శెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌పట్వారీ, మాజీ ఎమ్మెల్యేలు సౌదాగర్ గంగారాం, సౌదాగర్ సావిత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ న మోదు కార్యక్రమానికి మరో రెండు నెలల గడువు పెరగగా, ఇప్ప టి కే 82 శాతం పూర్తి చేసిన జిల్లా అగ్రగామిగా ఉందని కుంతి యా, పొన్నాల లక్ష్మయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు.
బీజేపీ, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం లో అధికారం చేపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా వ్యవహరించిందని, రెండు లక్షల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ద్వారా ఓటర్లను నమోదు చేసి అక్రమ పద్ధతిని అవలంభించిందని రామచంద్ర కుంతియా మండిపడ్డారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ మత మార్పిడులను ప్రోత్సహిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలసలతో కాలం గడుపుతోందన్నారు.
ఆరు నెలల పాలనలో బీజేీ ప, టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలను ఇం కెంతకాలమో మోసం చేయలేరని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేష్‌రెడ్డి, సురేశ్‌శెట్కార్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ కెసీఆర్‌ది నియంతృత్వ పాలన అని ధ్వజమెత్తారు. అ ధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పాకులాడలేదన్నారు.
ఏఐసీసీ అధినేత్రి సోని యా గాంధీ, యువనేత రాహుల్‌గాంధీపై పార్టీ కార్య కర్తలు, ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. మతతత్వ పార్టీలను విశ్వసించవద్దని, దేశ ఐక్యత కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వర్షాభావ పరిస్థి తులతో తీవ్ర కరువు నెలకొన్నందున తక్షణ మే నిజామాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నమ్మి ఓట్లేసి న ప్రజలను నట్టేట ముంచుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుందన్నారు.
టీఆర్‌ఎస్ నేతల వేధింపులపై ఆవేదన
సభలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చే శారు. బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోలీసు అధికారులు టీఆర్‌ఎస్ కా ర్యకర్తలుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ రోపించారు. టీఆర్‌ఎస్ నేతలు అక్రమవ సూళ్లకు కౌంటర్లు తెరిచారని విమర్శించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ కొందరు నేతలు సభలు, సమావేశాలకే పరిమితమవుతూ, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు.
పదేళ్లు అ ధికారంలో ఉండి కార్యకర్తలకేమీ చేయలే క పోయామని, ప్రస్తుత పరిస్థితులలో అయి నా, కొందరు నేతలు హైదరాబాద్‌లో ఉంటూ ఫోన్లు ఎత్తకుండా ఉంటే కార్యకర్తలు మన వెంట ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉన్నతస్థాయి నేతలు కార్యకర్తల బాగోగులు చూడాలని కోరారు. జడ్‌పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, బాన్సువాడ ఇన్‌చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై టీఆర్‌ఎస్ నేతల పెత్తనం పెరి గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్‌పీటీసీ సభ్యులకు కేటాయించే నిధులను సైతం ఎమ్మెల్యేలు మళ్లించుకుంటున్నారని శోభ ఆరోపించగా, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కక్షపూరి తంగా వ్యవహరిస్తూ, అక్రమ కేసులలో ఇరి కిస్తున్నారు బాలరాజు పేర్కొన్నారు. స్పం దించిన పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డి తదితరులు కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్ వేధింపులను సహించేది లేదని, ధైర్యంతో ముందుకు సాగుతామన్నారు. కార్యకర్తలకు బాసటగా ఉంటామని ప్రతిన చేశారు. నేతలకు దిశానిర్దేశం చేసిన కుంతియా, పొన్నా ల పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా కలిసి నడవాలని పిలుపునిచ్చారు.