పొన్నాల వస్తానంటే.. నేనే ఆహ్వానిస్తా: కేటీఆర్‌ | KTR Chit Chat: I Personally Welcome Ponnala To BRS If | Sakshi
Sakshi News home page

పొన్నాల వస్తానంటే.. నేనే ఆహ్వానిస్తా: కేటీఆర్‌

Published Fri, Oct 13 2023 6:15 PM | Last Updated on Fri, Oct 13 2023 6:37 PM

KTR Chit Chat: I Personally Welcome Ponnala To BRS If - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య.. బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం ఒకటి వెంటనే తెర మీదకు వచ్చింది. అయితే.. పార్టీ మారే విషయంపై పొన్నాల ఎటూ స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(KTR) స్పందించారు.  పొన్నాలను బీఆర్‌ఎస్‌లోకి తానే ఆహ్వానిస్తానని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు.

‘‘పొన్నాల మా పార్టీలోకి వస్తానంటే సంతోషం. రేపే ఆయన ఇంటికి వెళ్తా. నేనే ఆయన్ని దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానిస్తా’’ అని కేటీఆర్‌ చెప్పారు. అంతకు ముందు.. ఇదే విషయంపై మీడియా పొన్నాలను ఆరా తీసింది. ఈ నెల 16వ తేదీన ఆయన కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని.. జనగామ టికెట్‌ ఆయనకు బీఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసిందని ప్రచారం నడిచింది.  అయితే బీఆర్‌ఎస్‌లోగానీ.. మరేయిత పార్టీలో గానీ చేరబోతున్నారా? అనే మీడియా ప్రశ్నకు.. పొన్నాల దాటవేత ధోరణి ప్రదర్శించారు. ‘‘పదవుల కోసం మరేదానికోసమే రాజీనామా చేయలేదని, భవిష్యత్తుపై ఎవరెవరో ఏదేదో ఊహిస్తే.. తానేమీ సమాధానం చెప్పనని ఆయన అన్నారు. 

కేటీఆర్‌ చిట్‌చాట్‌ బైట్స్‌
దక్షిణ భారతంలో హ్యాట్రిక్ కొట్టిన సీఎంగా కేసీఆర్ నిలుస్తారు
మరో నాలుగు రోజుల్లో.. మిగతా ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తాం 
హైదరాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు
రాహుల్ గాంధీ లీడర్‌ కాదు.. రీడర్ మాత్రమే
మా అభ్యర్థులు 114 మంది అభ్యర్థులు ప్రచారం లో దూసుకుపోతున్నారు 
కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులే లేరు.. అలాంటపుడు  70  చోట్ల గెలుస్తామని ఎలా చెబుతారు? 
పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు .. ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరు 
డబ్బులు  ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టిక్కెట్లు  ఇస్తున్నారు 
► ఈ  మధ్య కాంగ్రెస్ నేత  ఒకాయన కలిశారు.. కూకట్ పల్లి సీట్ కోసం రూ. 15 కోట్లు అడిగారట 
► గతం లో నేను చేప్పినట్టే కర్ణాటక లో  అక్రమ డబ్బు  జమ అవుతోంది 
► తెలంగాణ కు  తరలించడానికి సిద్ధంగా  ఉన్న రూ. 42 కోట్ల  రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో  దొరికింది
అందులో కొడంగల్‌కు రేవంత్‌ రెడ్డి కోసం ఇప్పటికే రూ. 8 కోట్లు అందాయి
మేము  తొమ్మిదిన్నరేళ్ళు గా చేసిన పనుల గురించి  చెబుతున్నాం 
ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం 
మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్  బీజేపీ  పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా?
నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టు ల అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది 
 తండ్రి తన  అమ్మాయిని ఎవరితో పెళ్లి చేయాలన్న దాని పై చాలా ఆలోచిస్తారు 
► ఓటు వేసే ముందు కూడా ప్రజలు ఆలోచించాలి 
► అమిత్ షా అబద్ధాలకు  హద్దే లేదు 
► అమిత్ షా మా పై చేసిన  వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి 
► ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి  ప్రభుత్వం  అని తిడుతారు 
► ప్రధాని కి అంత అహంకారమా?
రాహుల్‌ గాంధీ లీడర్‌ కాదు.. రీడర్‌, ఏం రాసిస్తే అది చదువుతారు 
► ఈ ఎన్నికలు  తెలంగాణ  గల్లీ ఆత్మగౌరవానికి ఢిల్లీ  గుజరాత్ అహంకారానికి  మధ్య పోటీ 
► తెలంగాణ కు  గుజరాత్ ,ఢిల్లీ  అహంకారానికి మధ్య పోటీ 
► బీజేపీ ని వాళ్ళ నాయకత్వం వాళ్ళే సీరియస్ గా తీసుకోవడం లేదు 
బీజేపీ ఈసారి కూడా  110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం 
► బీజేపీ  సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుంది 
► సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద  స్థానాల్లో ప్రచారం  చేస్తున్నారు 
► నేను జీహెచ్‌ఎంసీ, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం  చేస్తాను 
► మేనిఫెస్టోలో  రైతులు ,మహిళలు ,దళితులు ,గిరిజనులు ,బలహీన వర్గాలు ,మైనారిటీలు ,పెన్షనర్ల ప్రయోజనాలకు  పెద్ద పీట వేస్తాం 
► అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ఊత కర్ర లా ఉంటుంది 
► ఆర్థిక క్రమ శిక్షణ లో మేమే ముందు ఉన్నాం ..
► ఏదీ సాధ్యమో ,ఏదీ అసాధ్యమో  మేము ప్రభుత్వం లో ఉన్నాం కనుక మాకు తెలుసు 
► ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ లో స్వతంత్రంగా పని చేస్తుందని  భావిస్తున్నా 
► నేను వ్యక్తిగతంగా సిరిసిల్ల లో ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ  చేయొద్దని నిర్ణయించా.. మిగతా వారు ఏ నిర్ణయం  తీసుకుంటారో  వాళ్ళిష్టం 
► కాంగ్రెస్  2004 ,2009 లలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను  నిలబెట్టుకోలేదు 
► మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టో  లోని హామీలు నిలబెట్టుకున్నాం 
► రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే అంశం పైనే  ఎన్నికలు  జరుగుతాయి 
► మతం  కులం ప్రాతిపదికన  ఓట్లు  కొంత వరకే పడతాయి 
► బీజేపీ  తో  మాకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు ,కాలేజీ లు ఎందుకు పెడతాం 
► సీఎం  కేసీఆర్, మోదీని తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదు 
► బీజేపీతో స్నేహం ఉంటే  ఎందుకు తిడతాం? 
మేము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదు 
► మేము ఎవరేమన్నా అతి మంచితనం తో వెళుతున్నాం 
► రేవంత్  అక్రమాలపై  బీజేపీ  ప్రభుత్వం ఐటీ ,ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదు? మా మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి 
► ఓటుకు నోటు కేసు  ను ఓపెన్ చేయండి.. ఎవరు వద్దన్నారు 
► ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది  ప్రజలే  ..అధికారులుకాదు 
► అధికారుల బదిలీలను..  బదిలీలలుగా గానే చూస్తాం 
ప్రజలు ఓటేసేపుడు  సీఎం  ఎవరుంటారు  అని చూస్తారు 
► కేసీఆర్  పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారు ..మేము చేసింది చెప్పుకుంటాం 
► గతం లో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చు 
► హుజురాబాద్  లో కూడా  మేమే గెలుస్తున్నాం 
► ఈటల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు  ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదు 
► బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో 
► షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదు 
► రాహుల్ గాంధీ  మోదీ లు కూడా ఇక్కడకొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదు 
► త్వరలో చాలా మంది  ప్రముఖులు బీ ఆర్ ఎస్ లో చేరతారు 
► కాంగ్రెస్ లో టికెట్ ల ప్రకటన తర్వాత  గాంధీ భవన్ లో తన్నుకుంటారు 
► కాంగ్రెస్ లో అపుడే  సీఎం  పదవికి ఇద్దరు  నేతల మధ్య  అంగీకారం కుదిరినట్టు  నాకు  సమాచారం ఉంది 
► గతం లో ఉత్తమ్ మాట్లాడినట్టే.. ఇప్పుడు  రేవంత్  మాట్లాడుతున్నారు
► కాంగ్రెస్ అంటే  గందర గోళం ,ఆగమాగం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement