
కేసీఆర్ పక్కనే తెలంగాణ ద్రోహులు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయినందుకు కె.చంద్రశేఖర్‌రావు ఏం సమాధానం చెబుతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానని చెప్పిన కేసీఆర్, తాను మాట్లాడిన వేదిక మీద కుడి, ఎడమ, వెనుక ఎవరున్నారో చూసుకుని మాట్లాడాల్సిందన్నారు.
కేసీఆర్ కేబినెట్‌లో తెలంగాణవాదులపై దాడులు చేసిన వారు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలన్నారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే నోరువిప్పని కేసీఆర్ ఇప్పుడు ఎరువులు అంటూ ఆశ చూపిస్తున్నారని పొన్నాల విమర్శించారు.