
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఫలితాలొచ్చాయని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరి గిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. గురువారం తన నివాసంలో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి నప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా సమయం కుదరలేదని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు.
లేఖ లో పేర్కొన్న విషయాలను ఆయన వివరించారు. పోలిం గ్ రోజున చాలా చోట్ల ఈవీ ఎంలు పనిచేయలేదని, వాటి స్థానంలో తప్పుడు ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన 36 గంటల తర్వాత కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించలేదని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన 3 గంటల్లో పోలింగ్ శాతం వెల్లడైందని, ఆ రాష్ట్రాల కంటే తక్కు వ అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మాత్రం 36 గంటలు పట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో, ఆ తర్వాత అక్రమాలు చేసినందుకే ఇంత సమయం తీసుకున్నారని ఆరోపించారు.
ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు..
ఎన్నికల ముందే టీఆర్‌ఎస్ అధినేత చెప్పినట్లుగానే ఫలితాలొచ్చాయని, పేర్లతో సహా ఆయన చెప్పిన వారే గెలిచారని, ఇది కూడా ఎన్నికల్లో అక్రమాలకు నిదర్శనమని పొన్నాల పేర్కొన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కౌం టింగ్ ఎందుకు జరిగిందో ఈసీ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదన్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వ్యక్తు లు కూడా ఓట్లు వేసినట్టు నమోదైందని ఎన్నికల తర్వాత మీడియా పరిశోధనల్లో తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment