
ప్రాజెక్టుల డిజైన్లు మార్చొద్దు: పొన్నాల
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను ఇష్టారాజ్యంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల తీవ్ర నష్టాలు ఉంటాయని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌ను కలిశారు.
సాగునీటి ప్రాజెక్టులకోసం గతంలో రూపొందించిన డిజైన్లు, వాటికోసం అయ్యే ఖర్చు, ఆయకట్టు, ముంపు వంటి అన్ని అంశాలను గవర్నర్‌కు వివరించారు. వాటిని మారిస్తే ఇప్పటిదాకా చేసిన వ్యయం వృథాకావడంతో పాటు చాలా సమస్యలు వస్తాయని పొన్నాల వివరించారు.