సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని పొన్నాల లక్ష్మయ్య నివాసానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. ఇక, కేటీఆర్‌తో పాటుగా మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా పొన్నాల ఇంటికి
ఇక, భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు పొన్నాల ఇంటికి వచ్చాం. ఆయనను బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించాం. ఈనెల 16వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో పొన్నాల చేరుతారు. పొన్నాలకు బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం. ఆయనకు గౌరవం, ప్రాధాన్యత ఇస్తాం. రేపు సీఎం కేసీఆర్‌ను కలవాలని పొన్నాలను కోరాం. కేసీఆర్‌తో భేటీ తర్వాత మిగిలిన విషయాలు పొన్నాల చెతుతారు. కేకే, డీఎస్ వంటి వాళ్లను పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించాం.
పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అవమానంగా మాట్లాడారు. 45 ఏళ్లు పనిచేసినా కాంగ్రెస్ అవమానాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు. ఆయన పార్టీలు మారొచ్చు కానీ ఇతరులు గౌరవం లేకపోతే మారొద్దా?. దిగజారుడు సంస్కృతి మంచిది కాదు. చనిపోయే ముందు పార్టీ మారటం ఏంటని మాట్లాడుతున్న నేతలు చిల్లరగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటుకు నోటుకు దొంగను పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారు. పొన్నాలకు మార్టీ న్యాయం చేస్తుంది’ అని కామెంట్స్ చేశారు.
అనంతరం.. పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ నన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలుస్తాను. సీనియర్ నాయకుడిపై మాట్లాడేందుకు రేవంత్‌కు ఎంత ధైర్యం. కాంగ్రెస్‌లో రేవంత్ అసెంబ్లీ సీటు గెలిచారా?. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్‌లోకి ఇలాంటి వాళ్లు వచ్చి భ్రష్టుపట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’
Comments
Please login to add a commentAdd a comment