ఆ ఒప్పందంతో రూ.వెయ్యి కోట్లు నష్టం
ఆ ఒప్పందంతో రూ.వెయ్యి కోట్లు నష్టం
Published Sun, Apr 2 2017 6:03 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
హైదారాబాద్: చత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ ఒప్పందం అనైతికమని, ఆ ఒప్పందం వల్ల తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లితుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనుమానాలు నివృత్తి చెయ్యకుండా మేధావులు, నిపుణులు, మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నదని విమర్శించారు. దొంగచేతికి తాళం ఇచ్చినట్టు విద్యుత్ అమ్మేవాడికే.. ధర నిర్ణయించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్న విషయం వాస్తవం కాదా.. అయినా ఎందుకు కొంటున్నారని సూటిగా అడిగారు. డిసెంబర్ 2015 న కేంద్ర ప్రభుత్వం సౌర, ఇతర విద్యుత్ ఇస్తామని లేఖ రాసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించలేదని, దాని వెనక ఉన్న కారణం ఏమిటో చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా గ్రిడ్ అనుసంధానం చేసినా కూడా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టి కొంటున్నారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం న్యాయ స్థానం లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మరో సారి మిమ్మల్ని న్యాయస్థానం మొట్టికాయలు వేయకుండా చూసుకోవాలని సూచించారు. చత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందం వల్ల ప్రజలకు ఏం లాభమో చెప్పాలని కోరారు.
Advertisement
Advertisement