
'మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేశారు'
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నసమయంలో తెలంగాణకు అన్నివిధాలా అన్యాయం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం ఆరోపించారు. ఆదివారం మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. తన పదవిని కాపాడుకునేందుకే పొన్నాల లక్ష్మయ్య పాదయాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు.
పాదయాత్రలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా టీకాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మంత్రి తుమ్మల మండిపడ్డారు.