
'అడగకుండానే అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది'
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
అయితే ఎమ్మెల్సీ సీటు కావాలని హైకమాండ్ను తాను అడగడం లేదని పొన్నాల స్పష్టం చేశారు. తాను అడగకపోయినా పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు.