
'ఆ మూడు జిల్లాల్లో పోటీ చేయడం లేదు'
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాల్లోనే పోటీ చేస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షల నుంచి సరైన ప్రతిపాదనలు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నల్గొండ - ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి - చంద్రశేఖర్, మహబూబ్నగర్ - దామోదర్రెడ్డి, నిజామాబాద్ - వెంకటరమణరెడ్డి, మెదక్ - శివరాజ్పాటిల్ పేర్లకు పార్టీ అధిష్టానం ఓకే చెప్పిందని ఉత్తమ్కుమార్ చెప్పారు.