ప్రజల్లో అసంతృప్తి మొదలైంది: పొన్నాల | Congress party 130 Foundation Day celebrations at Gandhi bhavan | Sakshi
Sakshi News home page

ప్రజల్లో అసంతృప్తి మొదలైంది: పొన్నాల

Published Sun, Dec 28 2014 11:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ప్రజల్లో అసంతృప్తి మొదలైంది: పొన్నాల - Sakshi

ప్రజల్లో అసంతృప్తి మొదలైంది: పొన్నాల

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఆదివారం నగరంలోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నాల మాట్లాడుతూ... ఆధికారం కోసం టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన హామీల భ్రమలు తొలిగిపోతున్నాయని అన్నారు.

లౌకికవాదానికి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పొన్నాల స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అపవాదు ఉందని అన్నారు. కాంగ్రెస్పార్టీకి 130 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం 130 కోట్ల మంది భారతీయులకు తెలుసన్న విషయాన్ని పొన్నాల ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement