ఎన్నికల కోసమే పర్యటన: పొన్నాల | The election is for a tour: Ponnala | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోసమే పర్యటన: పొన్నాల

Published Sat, Jan 10 2015 1:14 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

ఎన్నికల కోసమే పర్యటన: పొన్నాల - Sakshi

ఎన్నికల కోసమే పర్యటన: పొన్నాల

సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో మురికివాడ సందర్శించేంత వరకు అర్హులకు పింఛన్లు అందడం లేదని సీఎం కేసీఆర్‌కు తెలియలేదా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 44 లక్షల మంది పింఛనుదారులుంటే ఇప్పటి వరకు 27 లక్షల మందినే అర్హులుగా గుర్తించారన్నారు. మిగిలిన 17లక్షల మంది పింఛనుదారులకు, కొత్తగా గుర్తించిన వారికి ఫించను ఇవ్వకుండా ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఏడాది జరిగే వరంగల్ మున్సిపల్ ఎన్నికల కోసమే మురికి వాడల సందర్శనకు వెళ్లారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదని ఆయన చెప్పారు.
 
20న హైదరాబాద్‌కు దిగ్విజయ్

రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు ఈనెల 20న పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నట్లు పొన్నాల తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement