
అది కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభ
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన సభపై పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం పేరుతో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమంపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. అది కేవలం కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభని అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉనికిని కాపాడుకునేందుకే ఈ సభ చేపడుతు న్నారన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసిన కాల్వల ద్వారా నీళ్లిస్తూ.. తమ పార్టీవి మోసపూరిత ప్రాజెక్టులనడం సిగ్గుచేటన్నారు.