Sriram sagar
-
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
వరద కాల్వపై మరో ఎత్తిపోతల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న గోదావరి జలాల సమగ్ర వినియోగమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం వరద కాల్వపై మరో ఎత్తిపోతల పథకానికి ప్రాణం పోస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించేలా సూరమ్మ చెరువు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే వేసిన అంచనాల ప్రకారం.. ఈ ఎత్తిపోతల వ్యయం రూ.340 కోట్లుగా ఉంటుందని ఇంజనీర్లు తేల్చారు. ఎల్లంపల్లికి పూర్తి భరోసా.. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించిన ప్రభుత్వం, ఎల్లంపల్లి కింది ఆయకట్టుకు సైతం ఇదే పథకం నుంచి నీళ్లందించాలని గతంలోనే నిర్ణయించింది. ఎల్లంపల్లి కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుండగా, ప్రస్తుతం లక్ష ఎకరాలకే నీరందుతోంది. మరో 44 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎల్లంపల్లి నుంచి ఐదు దశల్లో వేమనూరు, మేడారం, గంగాధర, కొడిమ్యాల, జోగాపూర్ వరకు నీటిని లిఫ్టు చేసి సూరమ్మ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టారు. అయితే ఈ విధానం ద్వారా కాకుండా వరద కాల్వ నుంచి ఒకే ఒక్క దశలో నీటిని లిఫ్టు చేసి ఈ చెరువుకు తరలించేలా గతంలో జరిగిన సమీక్షల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపా దించారు. వరద కాల్వ 52వ కిలోమీటర్ నుంచి నీటిని మళ్లించి, దాన్ని పంపుల ద్వారా 85 నుంచి 90 మీటర్ల మేర ఎత్తిపోసి 10 కిలోమీటర్ల ఫ్రెషర్ మెయిన్స్ ద్వారా సూరమ్మ చెరువులోకి తరలించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. నీటి లభ్యత పెంచేందుకు చెరువు సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 0.45 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీంతోపాటే వరద కాల్వ ద్వారా తూములు నిర్మించి 139 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రతిపాదనకు రూ.340 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని మల్యాల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరందేలా దీన్ని డిజైన్ చేసినట్లు ఈఎన్సీ అనిల్‌కుమార్ వెల్లడించారు. -
‘పిల్ల కాల్వ’ల కళకళ!
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలనంతా సస్యశ్యామలం చేసే వ్యూహాలకు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 13.60 లక్షల ఎకరాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే ప్రణాళికను ఇప్పటికే అమల్లో పెట్టగా, దాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దే పనిలో పడింది. ప్రాజెక్టు పరిధిలో ముప్పై ఏళ్ల కింద నిర్మించిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ఆధునీకరించే పనులను చేస్తున్న ప్రభుత్వం, తాజాగా వాటి పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాల్వలు)ను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ.419 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతి ఎకరాకు నీటిబొట్టు ఎస్సారెస్పీలో భాగంగా ఉండే కాకతీయ కాల్వ, సరస్వతి, లక్ష్మీ కాల్వల ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో మొత్తంగా స్టేజ్–1 కింద 9.68 లక్షలు, స్టేజ్–2 కింద మరో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ఉండేది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి మానేరు వరకు 146 కిలోమీటర్ల వరకు ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం వాస్తవానికి 9,700 క్యూసెక్కులు. కానీ కాల్వలో చాలాచోట్ల పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతినడంతో దాని ప్రవాహ సామర్థ్యం 5 వేలకు పడిపోయింది. దీంతో ఎగువ మానేరులో ఉన్న సుమారు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది. దీంతోపాటే మానేరు దిగువన 146 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 8,505 క్యూసెక్కులు ఉండగా, అది 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువ మానేరులో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై గతంలోనే సమీక్షించిన సీఎం కేసీఆర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించి రూ 200 కోట్లతో పనులకు ఆదేశించారు. దీంతో కాల్వల సామర్ధ్యం 5వేల క్యూసెక్కుల వరకు పెరిగింది. అనంతరం కాల్వల ఆధునికీకరణకు అదనంగా రూ.863 కోట్ల వరకు కేటాయించారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయిన అనంతరం ఫిబ్రవరి 7న మరోమారు కాల్వల ఆధునికీకరణపై సమీక్షించిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌లోనే ఎస్సారెస్పీ పూర్తి స్థాయిలో నీరందించనున్న దృష్ట్యా, చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుల పనులు పూర్తి చేయా లని ఆదేశించారు. కాల్వలను పూర్తి స్థాయి డిశ్చార్జి సామర్థ్యానికి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారు. డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు మొత్తంగా డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.419.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కాకతీయ కాల్వ పనులకు రూ.88.39 కోట్లు, దాని కింది డిస్ట్రిబ్యూటరీలకు రూ.263.41 కోట్లు, సరస్వతి కెనాల్‌కు రూ.29.40 కోట్లు, లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు రూ.19.67 కోట్లు, సదర్‌మట్‌కింద 17.47 కోట్లు, మిగతా పనులకు రూ.1.41కోట్లతో అంచనా లు రూపొందిం చారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికై ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాల్సి ఉన్నందున తక్కువ సమయంలోనే వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీటితో ప్రతి ఎకరాకు నీరందే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. -
అది కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభ
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన సభపై పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం పేరుతో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమంపై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. అది కేవలం కేసీఆర్ రాజకీయ పునరుజ్జీవన సభని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉనికిని కాపాడుకునేందుకే ఈ సభ చేపడుతు న్నారన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసిన కాల్వల ద్వారా నీళ్లిస్తూ.. తమ పార్టీవి మోసపూరిత ప్రాజెక్టులనడం సిగ్గుచేటన్నారు. -
ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండి
ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద తగ్గు ముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టడానికి, పంటనష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. -
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు జలకళ
-
ఎస్సారెస్పీకి 70 వేల క్యూసెక్కుల వరద
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.10(45 టీంసీలు) అడుగులనీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. -
శ్రీరాంసాగర్‌కు భారీగా వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గానూ సుమారు 72 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1076.45 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ 42.958 టీఎంసీలకు చేరింది. ఈనెల 3న ప్రాజెక్టు నుంచి లోయర్ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే నీటిని కాకతీయ కాలువకు విడుదల చేయాలని శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎస్సారెస్పీ వచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. తమతో కలిసి రావాలని రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. (శ్రీరాంసాగర్) -
అడుగంటుతున్న శ్రీరాంసాగర్
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రాకపోవడం.. బాబ్లీ ప్రాజెక్టు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, వేసవి ప్రారంభం కాకముందే.. బుధవారం ఆనాటికి కేవలం 14.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లీకేజీల రూపంలో 200 క్యూసెక్కులు, ఆవిరితో 250 క్యూసెక్కుల నీరు నిత్యం తగ్గిపోతుందని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇక వేసవి ప్రారంభమైతే.. ప్రాజెక్టులో నీరు భారీగా ఇంకిపోయే ప్రమాదముంది. ఈ క్రమంలో వేసవిలో తాగునీటికి సైతం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకూ కూడా సాగునీటిని విడుదల చేయాలేదు. -
‘జలవిద్యుదుత్పత్తి’ కేంద్రానికి పాతికేళ్లు
బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకుని శనివారం 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 1988 డిసెం బర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారాక రామారావు చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుదుత్పత్తి. దీంతో ప్రభుత్వం కాకతీయ కాలువ ప్రారంభంలో సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభిం చారు. రెండో దశలో నాల్గవ టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండో టర్బయిన్ 1987 డిసెంబర్లో, మూడో టర్బయిన్ 1988 జూలైలో పను లు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెం బర్లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పనులు పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో.. జల విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు. టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్‌కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వి విధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 24 గంటలకోసా రి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుదుత్పత్తి కేం ద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుదుత్పత్తి జరుగుతుంది. 24 ఏళ్లలో కేవలం నాల్గు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్వీర్యమయ్యేలా ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాల్గు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడ ంలేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకాతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టి కాలువ కు గండి పడే ప్రమాదం లేక పోలేదు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న జల విద్యుదుత్పత్తి కేంద్రంపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు