ఛత్తీస్‌గఢ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి
పొన్నాల లక్ష్మయ్య డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలపై కోట్ల రూపాయల భారం పడుతుందని, అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ఓపెన్ బిడ్ కాకుండా ఎక్కువ ధరకు ఎంఓయూ చేసుకోవడం పెద్ద పొరపాటని అభిప్రాయపడ్డారు.
బుధ వారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తక్కువ ధరకే విద్యుత్‌ను ఇస్తామని చెప్పినా, ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుభవలేమితో ఈ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు ఈ ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు.