ఒప్పందకాలాన్ని పొడిగించాలని టీఎస్‌ఈఆర్సీ సూచన
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పం దం(పీపీఏ) కాల పరిమితిని 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సూచిం చింది. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై గతేడాది బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్సీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.
అయితే, రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న వార్ధా–డిచ్‌పల్లి–మహేశ్వరం 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం నెలరోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో పీపీఏపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ ట్రాన్స్‌కో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డిస్కంల అధికారులతో ఇటీవల సమావేశమైన ఈఆర్సీ... పీపీఏలో పలు సవరణలకు మౌఖికంగా సూచనలు చేసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ధరల భారం ఒకేసారి రాష్ట్రంపై పడకుండా ఒప్పంద కాలపరిమితిని 25 ఏళ్లకు పొడిగించాలని సూచన చేసింది. త్వరలో మార్వా థర్మల్ విద్యుత్ ధరలను ఖరారు చేయాలని ఛత్తీస్‌గఢ్ డిస్కంలు ఆ రాష్ట్ర ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నాయి.
25 ఏళ్లకు ‘ఛత్తీస్’ కరెంట్
Published Mon, Mar 13 2017 3:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement