నూతనకల్
మానవ మనుగడకు చెట్లే ఆధారమని.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్, గుండ్లసింగారంలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదెరి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. చెట్లను నరకడం వలన ఏడారిగా మారి ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణ కాలుష్యం పెరగడంతో వర్షాలు కురవడం లేదన్నారు. కేవలం లెక్కల కోసం రికార్డుల్లో మొక్కలు పెంచడం కాదని క్షేత్రస్థాయిలో నాటిన మొక్కలను బతికించాల్సిన బాధ్యత అధికారులది, వనసంరక్షణ కమిటీ సభ్యులదేనన్నారు.
అడవుల నరికివేతతోనే వర్షాలు కురవడం లేదు
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ అడవులను విచ్చలవిడిగా నరకడం వల్ల వర్షాలు సక్రమంగా కురవడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలన్నారు. మంత్రి స్వయంగా వాటర్ ట్యాంకర్ గల ట్రాక్టర్‌ను నడుపుతుండగా అధికారులు మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ మం త్రికి జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కాసోజు సుమలత, జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, వైస్ ఎంపీపీ తొనుకునూరి లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్‌ఏ రజాక్, తహసీల్దార్ డి. దశరథ, ఎంపీడీఓ ఎండీ ఫసియోద్దిన్, ఈఓపీఆర్డీ సాంబిరెడ్డి సర్పంచ్‌లు ఏనిగతల సోమయ్య, బూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఎలిమినేటి రమాదేవి పాల్గొన్నారు.
‘నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి’
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలు, అధికారులపై ఉందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల స్టేడియంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. చెట్లతోనే మావనవాళికి మనుగడ సాధ్యమని, బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి, నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మానవ మనుగడకు చెట్లే ఆధారం
Published Thu, Jul 9 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement