![Jagadish Reddy Slams Opposition Parties In election Campaign - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/18/Jagadish-Reddy.jpg.webp?itok=UGKIUQzy)
మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆత్మకూర్ –ఎస్ (సూర్యాపేట) : టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. వారికి ఏం హామీలు ఇవ్వాలో తెలియక ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మండల పరిధిలోని పాతర్లపహాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద దాదాపు 70 హోలియ దాసరి కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధిని చూసి వివిధ వర్గాలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్‌నాయకులు ఇచ్చే హామీలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాకి కృపాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బెల్లంకొండ యాదగిరి, మర్ల చంద్రారెడ్డి, ఆరెంపుల దానియేల్, గోపగాని సత్యం, తూడి నర్సింహారావు, కసగాని బ్రహ్మం, లింగయ్య, ముత్తయ్య, వెంకటయ్య, వీరయ్య, దానబోయిన సాయిల్, రావుల శ్రీనివాస్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment