ఉద్యమ ద్రోహమే కాంగ్రెస్‌కు శాపం
హుజూర్‌నగర్ : తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే ఆ పార్టీని శాపంగా వెంటాడుతోందని రాష్ట్ర విద్యాశాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టౌన్‌హాల్‌లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వా రికి మెడలో గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రజలు ఉద్యమం చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిందన్నారు.
అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి అండగా ఉండేందుకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
వంద రోజుల టీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని కొందరు నాయకులు అర్థంపర్థంలేని మాటలుమాట్లాడుతున్నారని విమర్శించారు. ఎడమకాల్వకు సాగునీరు విడుదల చేయకుండా చేతగాని దద్దమ్మల్లా కూర్చొని నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఆంధ్రోళ్లకు నీళ్లమ్ముకున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య.. రైతుల ఆత్మహత్యల గురించి మా ట్లాడటం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి ము ఖ్యమంత్రి కేసీఆర్ జెట్ వేగంతో తీసుకువెళ్తున్నారన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం జరిగితే,ఇందులో 10 వేల ఇళ్ల బిల్లులు కాజేశారన్నారు. త్వరలోనే అక్రమాలు వెలుగులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, కాసోజు శంకరమ్మ, చిలకరాజు నర్సయ్య, శ్రీనివాసరెడ్డి,ప్రవీణారెడ్డి, దొ డ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్ పాల్గొన్నారు.