సాక్షి, ఢిల్లీ: న్యాయ సలహా కావాలని అడిగినా.. కానీ అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాలులో మాట్లాడిన ఆమె.. తన అరెస్ట్ అక్రమం, సీబీఐ చేస్తోంది తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి పదిన్నరకు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పా’’ అని కవిత పేర్కొన్నారు.
కవిత వాదనలు
కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత హక్కులను కాపాడాలి. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత రెండు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కస్టడీ పిటిషన్‌పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి.
సీబీఐ వాదనలు:
ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment