సాక్షి, హైదరాబాద్: బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ఢిల్లీ బయల్దేరారు. వీరితోపాటు 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు.అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ క్రమంలోనే వీరంతా హస్తీనాకు పయనమయ్యారు.
కాగా కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో ఆమె జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఈ కేసుల్లో ఆమె ట్రయల్,హైకోర్టులో బెయిల్ కోసం ఆశ్రయించగా.. న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఈ క్రమంలో మంగళవారం సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకింది.
ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలకు కూడా బెయిల్ వచ్చింది. దీంతో, కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment