సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తాజాగా.. ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు.
ఎమ్మెల్సీ కవిత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కవిత.. సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో, కవిత సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆమె పోస్టుపై బీఆర్‌ఎస్ శ్రేణులు స్పందిస్తున్నాయి.
సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత రెండు క్రితమే తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు.. కవితకు బెయిల్ ఇవ్వడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కవితకు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment