
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment