చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma reacts on Assault Incident In East Godavari | Sakshi
Sakshi News home page

చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ

Apr 19 2021 1:40 PM | Updated on Apr 20 2021 8:07 AM

Vasireddy Padma reacts on Assault Incident In East Godavari - Sakshi

తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఖండించారు. మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆమె ఆదేశించారు.

సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఖండించారు. మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆమె ఆదేశించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయీం హస్మీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. తన ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త  కళ్యాణం వెంకన్న చేసిన పాశవిక దాడి అమానుషమన్నారు.

ఇద్దరిని పెళ్లాడటం తప్పు అని.. అనుమానాలతో భార్యలపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలను చిత్రహింసలు పెడుతూ మరో వ్యక్తితో సెల్‌లో వీడియో తీయించడం మరీ దారుణమన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

చదవండి: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!‌


చదవండి:
చికెన్‌, మటన్‌ గొడవ..! నిండు ప్రాణం బలి
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement