సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై చర్చించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా ఉద్యోగుల సూచనలను మహిళా కమిషన్ తీసుకుంది. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సెక్రెటరియేట్‌లోని మహిళా అధికారులు, ఉద్యోగిణీలు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం జరుపుకుందామని తెలిపారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మహిళలను గౌరవించలేని సమాజం అభివృద్ధి సాధించలేదని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్ తీసుకవచ్చిందని తెలిపారు.
పవన్‌కు మహిళా కమిషన్‌ను గౌరవించడంలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళా కమిషన్ నోటీసులను ఆయన లైట్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలంటీర్లపై దారుణమైన ఆరోపణలు చేశారు కనుకే ఆధారాలు చూపమన్నామని, వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. తమ పైనా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని, మరి మీ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని నిలదీశారు.
చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment