
సాక్షి, అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత... వాసిరెడ్డి పద్మతో మహిళ కమిషన్ చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, ఎంపీలు వంగా గీత, చింత అనురాధ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారుడు జీవీడీ కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వాసిరెడ్డి పద్మకు అభినందనలు తెలిపారు. కాగా ఈ నెల 8న మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment