
నన్నపనేని రాజకుమారి (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు మితిమీరుతున్నాయని ఏపీ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా కుమారి మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో మహిళలను చాలా దారుణమైన క్యారెక్టర్లుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. టీవీ సీరియల్స్ నుంచి అశ్లీల సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ప్రతి విషయంలో సామాజిక బాధ్యత వహించాలని, శాంతి భద్రతల కొరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ చట్టాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్‌లో ఎంపీ గల్లా జయదేవ్ అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి స్థానికంగా ఉపాధి పొందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment