ఉపాధ్యాయుడి బదిలీ అనంతరం మరొకరిని నియమించని ప్రభుత్వం
కూటమి పాలనలో మూడు నెలలుగా చదువుకు దూరమైన పిల్లలు
సొంత నిధులతో నియమించుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు
గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బులు పోగు చేసుకుని చదువుకున్న ఒక యువకుడిని వలంటీర్‌గా నియమించుకున్నారు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment