Transfer of teachers
-
చందాలేసుకుని విద్యా వలంటీర్ నియామకం!
గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బులు పోగు చేసుకుని చదువుకున్న ఒక యువకుడిని వలంటీర్‌గా నియమించుకున్నారు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదివారం మార్గదర్శకాలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రక్రియ చేపట్టాలని మార్గదర్శకాలిచ్చినా ప్రభుత్వ షరతులకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. దీంతో 14న మరోసారి పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. నేతలు తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. ఇందులో జీవో నం.117 రద్దు మినహా మిగిలిన వాటికి అంగీకరించారు. దీనిప్రకారమే ఆదివారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.ఈ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో క్యాడర్ సీనియారిటీ పరంగా జూనియర్‌ను మిగులుగా గుర్తిస్తారు. సీనియర్ ఉపాధ్యాయుడి అంగీకారంతో మిగులు ఉపాధ్యాయుల స్థానంలో పని సర్దుబాటుకు సిద్ధంగా ఉంటే వారికి అవకాశమిస్తారు. క్యాడర్ సీనియారిటీని లెక్కించేందుకు ఒకే డీఎస్సీ, మెరిట్–కమ్–రోస్టర్‌లో ఉన్న టీచర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీల్లో సబ్జెక్ట్ టీచర్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ లేని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పని సర్దుబాటు ప్రక్రియ 9వ తేదీ నాటికి యూడైస్‌లో నమోదైన డేటా ఆధారంగా నిర్వహిస్తారు. -
సిఫారసులకే సర్దుబాటు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తి కావాల్సి ఉండగా టీచర్, విద్యార్థుల నిష్పత్తి, సర్వీస్, స్టేషన్ అంశాల్లో ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై తర్జనభర్జనతో బదిలీలను సోమవారానికి వాయిదా వేశారు. పైకి మాత్రం పని సర్దుబాటు ఆధారంగా బదిలీలు అని చెబుతున్నా అంతర్గతంగా కూటమి నేతలకు కాసులు కురిపించే ప్రక్రియగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సిఫారసు లేఖలతో వచ్చిన వారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రులు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదే అదనుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిఫారసు లేఖలతో మండలం, జిల్లా కేంద్రాలకు లేదంటే సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుండటంతో భారీగా అక్రమాలకు ఆస్కారముందని పలు ఉపా«ద్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తం 29,992 మంది ఉపాధ్యాయులు మిగులు కనిపిస్తుండగా ఈ ఏడాది ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారు 2 వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలని విద్యాశాఖ నిబంధన తేవడంతో గరిష్టంగా 4 వేల నుంచి 5 వేల మందికి బదిలీకి అవకాశముంది. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీల నుంచి మినహాయించారు. బదిలీలు 1: 20 ప్రకారం చేయాలని డిమాండ్ ఇటీవల ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్‌లో సిబ్బంది సర్వీసు వివరాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్ జోడించారు. దీనిద్వారా ఉపాధ్యాయులంతా తమ సర్వీస్ రికార్డు వివరాలను నమోదు చేశారు. ఈ లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు (సబ్జెక్టు టీచర్లు) 8,773 మంది, ఎస్జీటీలు 20,469 మంది మిగులు ఉన్నట్టు తేల్చారు. ఎయిడెడ్‌లో మరో 750 మంది కలిపి మొత్తం మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది ఉన్నారు. సర్దుబాటు బదిలీల్లో భాగంగా 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ లెక్కన సర్దుబాటు చేస్తే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నష్టం జరుగుతుంది.ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ నిష్పత్తిలో, ఉన్నత పాఠశాలలకు 1:45 నిష్పత్తిలో లేదా జీవో53 ప్రకారం ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసు్తన్నారు. దీనివల్ల 6 నుంచి 7 వేల మందికి అవకాశం లభిస్తుందంటున్నాదీనిపై ప్రభుత్వం స్పందించలేదు. సర్దుబాటు బదిలీల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీలతో చర్చించేందుకు రావాలని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించినప్పటికీ తామనుకున్న వి«దంగా ప్రక్రియ ముగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సర్దుబాటు బదిలీలు తొలుత రాష్ట్ర స్థాయిలో చేపట్టాలని నిర్ణయించినా అనంతరం జిల్లా స్థాయిలో మండల యూనిట్‌గా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి నేతలు దీన్ని ఆసరాగా చేసుకుని తమ సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిని కోరుకున్నచోటకు పంపించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. -
తప్పు.. మీదంటే మీదే
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో డిప్యుటేషన్ల వ్యహారం చిచ్చురేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సమగ్ర వివరాలు అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారంఊ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మండిపడుతున్నాయి. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సాధారణ బదిలీలు చేపట్టకుండా, అయినవారు, ముడుపులు ఇచ్చి న వారిని కోరుకున్న ప్రాంతానికి పంపుతు న్నారని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో టీచర్లు సిటీకి.. చదువులు గాలికి’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొత్త వివాదానికి దారి తీస్తున్న డిప్యుటేషన్లు టీచర్ల డిప్యుటేషన్ అంశం అధికారుల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు కొంతమంది ఈ తంతుతో తమకు సంబంధమే లేదని చెబుతున్నారు. తాను వ్యతిరేకించినా డిప్యుటేషన్ ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదని ఓ అధికారిణి తెలిపారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నా, ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, విద్యాశాఖ ఉన్నతాధికారి మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఫైల్ సంబంధిత అధికారిణి ద్వారానే తనకు వస్తుందని, ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మానవతకోణంలో బదిలీలు చేస్తున్న విషయాన్ని ఆమె ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో తెలియడం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పరస్పరం సీఎంఓకు ఫిర్యాదులు చేసుకుంటున్న వైనం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. రంగంలోకి మధ్యవర్తులు తీవ్ర విమర్శలు వస్తున్నా డిప్యుటేషన్ వ్యవహారం ఆగడం లేదు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు గత నెల 11వ తేదీన ఓ టీచర్‌ను డిప్యుటేషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని డిప్యుటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యుటేషన్ల బేరసారాలు పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయని టీచర్లు అంటున్నారు. అనారోగ్య సర్టీఫికెట్లు సృష్టించి మరీ డిప్యుటేషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని వారు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడిని ముందుకు తెస్తుంటే, మరికొంతమంది తమకు విద్యాశాఖలో ఉన్నతాధికారి తెలుసునని, ఆయనకు కొంత ముట్టజెబితే డిప్యుటేషన్ సులభమని నమ్మిస్తున్నారని పలువురు టీచర్లు తెలిపారు. ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పాటించి విశ్వసనీయతను కాపాడుకోవాలి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ పేరిట జిల్లాలు దాటించి బదిలీలు చేయటం సమంజసం కాదు. అనారోగ్యం, భార్యభర్తలు తదితర సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని అవసరమైన, అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వటం సమంజసం. ఉపాధ్యాయులు బదిలీలకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించారు. నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధానకార్యదర్శి -
TS: టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలపై ఈ నెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్మోషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలంటూ న్యాయవాది బాలకిషన్ వాదనలు వినిపించారు. చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
పరస్పర బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం అందజేసిన దరఖాస్తుదారుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు. విద్య, హోంశాఖల నుంచి అధికసంఖ్యలో పరస్పర బదిలీల కోసం దరఖాస్తులొచ్చాయి. విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాకాటి కరుణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోనల్, జోనల్, జిల్లా క్యాడర్లకు పలువురు ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబితాలను ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీపై వెళ్లేవారికి కొత్త లోకల్ క్యాడర్లోని ప్రస్తుత రెగ్యులర్ చివరి ఉద్యోగి తర్వాతి ర్యాంక్‌ను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలకు టీఏ, డీఏ వర్తించదని తెలిపారు. ఇదిలా ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు వెళ్తే మొత్తం సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుందని గతంలో జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టులో కేసు వేయడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. ఈ అంశంపై తుదితీర్పునకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం జారీ చేయడంతో పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలపై హైకోర్టు తుదితీర్పునకు కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి సమ్మతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. -
జిల్లాలో రెండేళ్లు ఉంటే చాలు
సాక్షి, అమరావతి: అంతర్ జిల్లా టీచర్ల బదిలీల నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ఆ జిల్లాలో ప్రస్తుత కేడర్‌లో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండాలన్న నిబంధనుంది. అయితే టీచర్ సంఘాల అభ్యర్థన మేరకు కేడర్‌తో సంబంధం లేకుండా ఆయా జిల్లాల్లో నియామకమై 2021 జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే చాలని నిబంధనను సవరించారు. దీనిని అనుసరించి టీచర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి తాత్కాలిక తేదీలతో బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించారు. బదిలీలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ముగించనున్నారు. మొత్తం ప్రక్రియ 43 రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించారు. -
టీచర్ల బదిలీలపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ, దానికి తోడు సాంకేతిక సమస్యలు విద్యాశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బదిలీ కేటాయింపుల్లో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బదిలీ అయిన టీచర్ల జాబితా ఖరారు కావడం లేదు. గత మూడు రోజులుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీ పోస్టింగులపై కసరత్తు జరుగుతున్నప్పటికీ కొలిక్కిరావడం కష్టంగా మారింది. వాస్తవానికి శుక్రవారంనాడే స్కూల్ అసిస్టెంట్ల బదిలీల జాబితా వెలువడాల్సి ఉంది. కానీ పలు జిల్లాల్లో కేటాయింపుల్లో తప్పులు దొర్లాయి. ఒకే చోట ఇద్దరేసి టీచర్లకు కేటాయించడం, మున్సిపాలిటీ మొత్తాన్ని ఒకే గ్రామంగా పరిగణించడం లాంటి కారణాలతో జాబితా తలకిందులైంది. స్పౌజ్ జియోట్యాగింగ్‌లోనూ గందరగోళం నెలకొనడంతో వాటిని సరిదిద్దేందుకు విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మొత్తానికి ఆదివారం రాత్రి పొద్దుపోయాక స్కూల్ అసిస్టెంట్ల బదిలీ జాబితాను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు అందించింది. వీటిని జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో వాటిని ఆయా జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టేందుకు డీఈవోలు చర్యలు చేపట్టారు. ఎస్జీటీల జాబితా రేపే సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలపై ఉత్కంఠ వీడలేదు. స్కూల్ అసిస్టెంట్ల తుది జాబితా తర్వాతే వాటిని విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎస్జీటీల బదిలీల జాబితాను సోమవారం కల్లా తేల్చేసి రాత్రిలోగా జాబితా ఖరారు చేయాలని నిర్ణయించారు. బదిలీల ప్రక్రియలో జాప్యంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకత, సమయపాలన అని పేర్కొని మాన్యువల్ పద్ధతిలోనే బదిలీలు చేస్తున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఎస్జీటీల తుది జాబితాను తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్ డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : బోగస్ వైద్య ధ్రువపత్రాలు సమర్పించి తప్పుడు పద్ధతుల్లో బదిలీ దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై తక్షణ చర్యలు చేపట్టాలనే కలెక్టర్ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆదివారం కలెక్టరేట్ ఎదుట టీఎస్టీయూ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేసేలా జిల్లాలో తప్పుడు వైద్య ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ దరఖాస్తులు చేసిన టీచర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 42 మంది నకిలీ వైద్య పత్రాలు సమర్పించారని తేల్చిన జిల్లా విద్యాశాధికారి కార్యాలయం టీఎస్టీయూ ప్రాతినిధ్యం మేరకు కలెక్టర్‌కు సమర్పించగా.. వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించి వారం రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు. 2015 సంవత్సరంలో ప్రారంభమైన నకిలీ పత్రాల పరంపర 2018 బదిలీ వరకు వాటి సంఖ్య అనూహ్యంగా పెరగడానికి కారణం చర్యలుండవనే భరోసాతో ఉపాధ్యాయులు నకిలీ పత్రాలు సమర్పించడానికి వెనుకాడడం లేదన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు టీఎస్టీయూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. డీఈవో కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు పరిశీలన కోసం పని చేసిన టీచర్ తాను అంధున్ని అని దరఖాస్తు చేసుకోవడం, కరీంనగర్ మెడికల్ బోర్డులో నరాల సంబంధమైన డాక్టర్ల బృందం లేకున్నా ఆ వ్యాధుల సర్టిఫికెట్లు జారీ చేసిన విధానం చూస్తే ఎంత దిగజారుడు పద్ధతుల్లో పత్రాల జారీ జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. సర్వర్, సాఫ్ట్వేర్ సమస్యలతో బదిలీల సందర్భంగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ఆప్షన్స్ ప్రాధాన్యక్రమం మారిపోయిందని, ఈ విషయంలో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నాయకులు కంకణాల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎన్.కిరణ్‌కుమార్, గంగుల అంజిరెడ్డి, కటుకం అశోక్‌కుమార్, బండ నర్సింహారెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్ అహ్మద్, రమణకుమార్, కృష్ణ, కె.సత్యనారాయణ, నారాయణరెడ్డి, దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి, కోడూరి లక్ష్మిరాజం, నారాయణ, స్వరూపారాణి, మనోహర్‌రెడ్డి, గంగేశం తదితరులు పాల్గొన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి న్యాయపరంగా ఉన్నవాటిని సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుంటే నష్టపోయిన ఉపాధ్యాయులు కోర్టుకు పోక తప్పదని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కటుకం రమేశ్, ఎస్.ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 400 మంది ఉపాధ్యాయులు సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నారని, న్యాయమైన వాటిని పరిష్కరించేందుకు ఎడిట్ ఆప్షన్లివ్వాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ విషయంలో ఇప్పటికి గందరగోళం నెలకొందని, జీవో 16 మేరకే ఉపాధ్యాయ బదిలీలు జరగాలని అన్నారు. ఏకపక్షంగా ఆలోచించకుండా ప్రభుత్వం ఇకనైనా ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఇస్తూ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. -
మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి
జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. -
వీడని గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల తుది సీనియారిటీ జాబితా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను నామమాత్రంగా పరిశీలించినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,514 మందికి ఒకేచోట పనిచేసే సర్వీసు గడువు ముగియడంతో తప్పనిసరి బదిలీ కానుంది. మరో 43,803 మంది సాధారణ నిర్దేశిత సర్వీసు పూర్తి కానప్పటికీ స్థానచలనం కోసం బదిలీ దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం ఈ నెల 15న ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రకటించింది. ఈ క్రమంలో ఏకంగా మూడో వంతు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిని పరిశీలించేందుకు వారం రోజులు గడువు తీసుకున్న విద్యాశాఖ.. శుక్రవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులోనూ పెద్ద సంఖ్యలో తప్పులు దొర్లినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలాచోట్ల మెడికల్ బోర్డులు తిరస్కరించిన వాటిని కూడా ప్రిఫరెన్షియల్ కోటాలో నమోదు చేయడం గందరగోళం సృష్టిస్తోంది. మరికొందరి ఎన్టైటిల్మెంట్ పాయింట్లలోనూ వ్యత్యాసాలు రావడంతో టీచర్లలో గాబరా మొదలైంది. శనివారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. ఈనెల 23న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 24, 25 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, 26, 27 తేదీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. డీఈవోలకు ఎడిట్ ఆప్షన్.. విద్యా శాఖ ప్రకటించిన తుది సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే డీఈవోలకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు వెబ్సైట్లో ఎడిట్ చేసేలా అవకాశం కల్పించింది. తాజాగా ప్రకటించిన తుది సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఆ మేరకు డీఈవోలు మారుస్తారు. దీంతో తుది సీనియారిటీ జాబితా మారనుంది. అయితే వేల సంఖ్యలో అభ్యంతరాలుండటంతో వాటిని ఒకట్రెండు రోజుల్లో ఎలా మారుస్తారని ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో పెద్ద సంఖ్యలో పొరపాటు వచ్చినట్లు ఆరోపిస్తున్నారు. స్పౌజ్ పాయింట్లు, ప్రిఫరెన్షియల్ పాయింట్ల కేటాయింపులో భారీగా అవకతవకలున్నాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పొరపాట్లను సవరించాక జాబితా విడుదల చేసిన అనంతరం పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. వెబ్‌కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్లపై అవగాహన లేకపోవడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారని ఎస్సీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. అవగాహన కల్పించాకే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు వెబ్ఆప్షన్లపై అవగాహన సాధ్యం కాదని, మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపాలని టీఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, సి.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తేలని అంతర జిల్లా స్పౌజ్ పాయింట్లు.. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో అంతర జిల్లా స్పౌజ్ (భార్యా,భర్తలు) పాయింట్లకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయుల నుంచి వినతులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగి పనిచేసే జిల్లా పరిధిలో స్పౌజ్ ఉంటేనే ప్రత్యేక పాయింట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఉద్యోగి భర్త గానీ, భార్య గానీ పొరుగు జిల్లాలో పనిచేస్తే ఇందులో పరిగణించట్లేదు. దీంతో కొందరు ఉపాధ్యాయులు తమ స్పౌజ్ పొరుగు జిల్లా పనిచేస్తే స్పౌజ్ పాయింట్లు ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు విద్యాశాఖకు సూచన చేసింది. కానీ కోర్టు ఇచ్చిన సూచన విద్యా శాఖ పట్టించుకోవట్లేదని పలువురు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
మళ్లీ మొదటికి..
►ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ►మొదటికొచ్చిన రేషనలైజేషన్ ►అధికారులకు కొత్త తలనొప్పులు ►స్థాన చలనం కోసం 9 వేల మంది దరఖాస్తు ►67 ప్రాథమిక పాఠశాలలు మూత ►యూపీ స్కూల్స్ 100కు తగ్గే అవకాశం నెల్లూరు (టౌన్) : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తాజా షెడ్యూల్ ప్రకటించింది. దీంతో హేతుబద్ధీ్దకరణ (రేషనలైజేషన్) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రేషనలైజేషన్, వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ప్రభుత్వం తాత్సారం చేయడంతో నెల రోజులపాటు గందరగోళం నెలకొంది. బదిలీలకు సంబంధించిన జీఓలో సవరణలు చేయగా.. ఉపాధ్యాయులు మెట్టు దిగకపోవడంతో పాయింట్లు, ఇతర నిబంధనల మార్పు, పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులకూ తప్పని అవస్థలు తాజా షెడ్యూల్ జిల్లా విద్యాశాఖ అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే పూర్తిచేసిన రేషనలైజేషన్ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి తగినంత మంది విద్యార్థులు లేని పాఠశాలల్ని మూసివేయడం, వారిని సమీపంలోని పాఠశాలలో విలీనం చేయడం కష్టతరం కానుంది. ఇదిలావుంటే.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాయింట్లపై కుస్తీ పడుతూ విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఫలితంగా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తాజా షెడ్యూల్ విడుదలతో మరో నెల రోజులపాటు బోధన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు చదువులో రెండు నెలలపాటు వెనుకబడే దుస్థితి నెలకొంది. కార్పొరేట్ పాఠశాలల్లో తొలి విడత సిలబస్ పూర్తిచేసి ఫార్మెటివ్ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 67 ప్రాథమిక పాఠశాలల మూసివేత గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. తాజా నిర్ణయం వల్ల ఈ కార్యక్రమం మొదటికొచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 63 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. వీటితోపాటు 100 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. ఉన్నత పాఠశాలల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. 6 వేల మందికి బదిలీ తప్పనిసరి జిల్లాలో 9 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకేచోట 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు 6 వేల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వీరంతా తప్పనిసరిగా బదిలా అవుతారని చెబుతున్నారు. వీరుకాకుండా మరో 3 వేల మంది బదిలీ కోసం విజ్ఞాపన దరఖాస్తు చేకున్నారు. వీరిలో ఎంతమందికి బదిలీ అవుతుందనేది తేలాల్సి ఉంది. మిగులు ఉపాధ్యాయులు 500 మంది తాజా మార్గదర్శకాల ప్రకారం చూస్తే జిల్లాలో 500 మంది మిగులు ఉపాధ్యాయులుగా ఉంటారని భావిస్తున్నారు. వీరందరినీ కొరత ఉన్న పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఇదేం ‘పనితీరు’!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 63 జీఓను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన జీఓలోని పలు అంశాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బాగా పని చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామంటూ జారీ చేసిన ‘పనితీరు పాయింట్లు’ గందరగోళంగా మారాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో పిల్లలు చదువుకుంటుంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. అసలు పిల్లలే లేని, పెళ్లికాని, పిల్లలు పెద్దవారై కాలేజీల్లో చదువుతున్న వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేదు. వందశాతం విద్యార్థుల నమోదైన పాఠశాలలకు మూడు పాయింట్లు కేటాయిస్తామని చెప్పారు. అదికూడా ప్రాథమిక స్థాయి అయితే ఎంఈఓ, ఉన్నత స్థాయి అయితే డీవైఈఓ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రామాణికం లేకపోవడంతో టీచర్లు గందరగోళం చెందుతున్నారు. ఇక్కడ అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అలాగే పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు 3 పాయింట్లు ఇచ్చారు. అంటే కొన్ని చిన్న స్కూళ్లలో 20-30 మంది విద్యార్థులుండి అందరూ ఉత్తీర్ణత పొంది ఉంటారు. అలాగే 100 మంది పిల్లలుండి 3-4 శాతం ఫెయిలైతే ఆ స్కూల్ వెనుకబడినట్లే. కేటగిరి-4 ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు స్థానికంగా కాపురం ఉన్నట్లైతే 2 పాయింట్లు కలుపుతారు. స్థానికంగా ఉన్నారనే విషయాన్ని ఎవరు ధ్రువీకరిస్తారు? దీన్నిబట్టి చూస్తుంటే ఇక్కడ అక్రమాలకు తెర తీసే అవకాశం పుష్కలంగా ఉంది. రెండేళ్లలోపు దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి రూ. 2-3 లక్షల దాకా ఖర్చు చేసి ఉంటే 2 పాయింట్లు కేటాయిస్తారు. రూ. 1.90 లక్షల లోపు ఖర్చు చేసి ఉంటే ఒక పాయింట్ కేటాయిస్తారు. కేవలం రెండేళ్లు మాత్రమే అని చెప్పడంతో చాలామంది టీచర్లు తమ స్కూళ్ల అభివృద్ధికి కృషి చేసి కూడా పాయింట్లు పొందలేని పరిస్థితి. ఆ స్కూల్లో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. గతేడాదికంటే ఈఏడాది 10-20 శాతం విద్యార్థుల నమోదు పెరిగి ఉంటే 2 పాయింట్లు కేటాయిస్తామన్నారు. చాలా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అస్కారమే లేదు. రెండేళ్లుగా 95 శాతం హాజరున్న ఉపాధ్యాయులకు 3 పాయింట్లు కేటాయించారు. దీన్నిబట్టి చూస్తుంటే ఉపాధ్యాయుల కనీస హక్కులు కాలరాసినట్లేనని వాపోతున్నారు. సీఎల్, మెటర్నటీ, ఇతర ప్రత్యేక సెలవులు తీసుకుని ఉంటే 95 శాతం హాజరు ఎలా వస్తుందంటున్నారు. ఇలా జీఓలో పొందుపరిచిన చాలా అంశాలు గందరగోళంగా మారాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. -
ముగ్గురు డిప్యూటీ డీఈవోలపై వేటు
- ఇప్పటికే డీఈవో చంద్రమోహన్ సస్పెన్షన్ - టీచర్ల బదిలీల్లో అక్రమాల ఫలితం - పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ - పూర్తిస్థాయిలో విచారణ అనంతరం చర్యలు విద్యారణ్యపురి : ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరగడం, వీటి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు డిప్యూటీ డీఈఓలపై వేటు పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తిని కరీంనగర్ డైట్ కళాశాలకు.. డీఈవో కార్యాలయంలోరాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) డిప్యూటీ డీఈవో అబ్దుల్హైని, మహబూబాబాద్ డిప్యూటీ డీఈవో రవీందర్‌రెడ్డిని ఆదిలాబాద్ డైట్ కళాశాలకు బదిలీ చేశారు. వీరిని హన్మకొండ డైట్ కళాశాల నుంచి కూడా రిలీవ్ చేశారు. మంగళవారం డిప్యూటీ డీఈవోలను విధుల నుంచి తొలగిస్తూ ఆర్జేడీబాలయ్య ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. బుధవారం ఆ ముగ్గురిపైనే బదిలీ వేటు వేశారు. ఇప్పటికే డీఈఓ చంద్రమోహన్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో విచారణ హన్మకొండ డైట్ కళాశాలలో లెక్చరర్లుగా పని చేస్తున్న ఆ ముగ్గురు డిప్యూటేషన్‌పై కొన్నేళ్లుగా జిల్లాలో డిప్యూటీ డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే నెపంతో వీరిపై బదిలీ వేటు పడింది. తరుపరి విచారణ అనంతరం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారం విద్యాశాఖను కుదిపేస్తోంది. కలెక్టర్ విచారణ అధికారిగా నియమించిన జేసీ తిరుపతిరావు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో అక్రమాలు పూర్తిస్థాయిలో వెలుగుచూసే అవకాశం ఉంది. సీనియూరిటీ వచ్చాక ఎన్టైటిల్మెంటు పాయింట్లు అధికంగా వేయించుకోవడం, సీనియూరిటీ జాబితాలో సీరియల్ నంబర్లో మార్పులు చేసి బై నంబర్లు వేయించుకుని సంతకాలు చేయించుకోవడం, ముందు ఖాళీలు చూపకుండా తమకు అనుకూలమైన వారికి తర్వాత చూపించి వాటిని భర్తీ చేయడం, టీచర్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి బదిలీ చేయించుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో విచారణ సాగుతోంది. కాగా, పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఎవరి పాత్ర ఎంత అనేది తేలనుంది. ఈనెల 6న డిప్యూటీ డీఈఓలను సస్పెండ్ చేయాలని కూడా టీఎస్ ఓ ఉపాధ్యాయ సంఘం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించబోతుంది. బదిలీ అయి జాయిన్కాకుండా తిరుగుతున్న కొందరు టీచర్లు టీచర్ల బదిలీల సందర్భంగా కొందరు టీచర్లకు తా ము అనుకున్నచోటికి బదిలీ కాలేదు. గతంలో మం చి ప్లేస్‌లో ఉండి.. పక్షం రోజుల క్రితం సూదర మం డలాలకు బదిలీకావడంతో వారు బదిలీ అయిన పా ఠశాలలకు వెళ్లకుండా మాడిఫికేషన్ కోసం హన్మకొండలోని డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పలువురు బదిలీల సందర్భంగా కౌన్సెలిం గ్‌కు హాజరుకాకుంటే చివరికి మిగిలిన వేకన్సీ పోస్టులలో ఎక్కడో ఒక చోటికి బదిలీ చేసి ఉత్తర్వులు ఇస్తారు. అలా కొన్ని ఉత్తర్వులు ఇంకా డీఈవో కా ర్యాలయంలో ఉండగా వారికి సమాచారం ఇస్తే వ చ్చి మాకు అక్కడికి పోవటం ఇబ్బందిగా ఉం టుందని మాడిఫికేషన్ చేస్తారా అని కూడా అడుగు తూ జాయిన్కాకుండా ఉంటున్నారు. వీరిపై చర్య లు ఏవి అనేది చర్చగా ఉంది. ఒక్కరోజు పాఠశాలకు గైర్హాజరైతేనే తనిఖీలో వెల్లడియితే ఆయా టీచర్లను సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయి. జాయిన్‌కాని టీచర్ల జాబితా రూపొందించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతోంది. -
8 వేల స్కూళ్లకు మంగళం
* రేషనలైజేషన్‌తో విలీనం కానున్న ప్రాథమిక పాఠశాలలు * యూపీ, హైస్కూళ్లకూ హేతుబద్ధీకరణ ముప్పు * గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి * 8న టీచర్ల బదిలీల షెడ్యూల్? సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు ముందు పాఠశాలలను హేతుబద్ధీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనతో రాష్ట్రంలోని ఎనిమిది వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హేతుబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైల్‌పై సంతకం చేయగానే స్కూళ్లు మూతపడనున్నాయి. ఇందులో ఇప్పటికిప్పుడు విలీనం చేసే పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేసేందుకు వీలుగా ఉన్న పాఠశాలల జాబితాను ఫార్మాట్-ఏలో చూపించారు. ఫార్మాట్- బీలో మలిదశ విలీన పాఠశాలలను చూపించింది. ఇలా ప్రభుత్వ, ఎంపీపీ స్కూళ్లకు ఒక ప్రతిపాదనను, మున్సిపల్ స్కూళ్లకు మరో ప్రతిపాదనను సిద్ధం చేశారు. తొలిదశ విలీన జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 4,854 ఉండగా 507 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. మలిదశ జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 2,762 ఉండగా, మున్సిపల్ పాఠశాలలు 95 ఉన్నాయి. తొలిదశలో ఆదర్శ పాఠశాలలుగా మారే స్కూళ్లు ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 3,544, మున్సిపాలిటీల్లో 355గా ఉన్నాయి. మలిదశలో ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 1,353 మున్సిపాలిటీల్లో 46గా ఉన్నాయి. హేతుబద్ధీకరణను కేవలం ప్రాథమిక పాఠశాలలకే పరిమితం చేయరాదని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలనూ రేషనలైజేషన్ పరిధిలోకి ఇప్పుడే తీసుకువస్తే మంచిదని ప్రభుత్వంలోని పెద్దలు అధికారులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్లోకి తీసుకువస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందు ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని పూర్తిచేశాక తదుపరి దశలో మిగతా పాఠశాలలకు హేతుబద్ధీకరణ చేపట్టవచ్చని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. హేతుబద్ధీకరణలో విలీనమయ్యే పాఠశాలల జాబితాను సిద్ధం చేసినందున మంత్రి దానిపై సంతకం చేసిన వెంటనే ఈ నెల 8వ తేదీన టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. బదిలీల వెబ్ కౌన్సెలింగ్‌పై అనుమానాల నివృత్తికి ఈ నెల 7వ తేదీన నమూనా వెబ్ కౌన్సెలింగ్‌ను ఆయా యూనియన్ ప్రతినిధుల ముందు నిర్వహించనున్నారు. అంతకు ముందు పాఠశాలల విలీన ప్రక్రియకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. -
డీఈవోపై వేటు
సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ - టీచర్ల బదిలీల్లో అక్రమాల ఫలితం - వరంగల్‌ను విడిచి వెళ్లకూడ దని ఆంక్షలు - ఇన్చార్జి డీఈవోగా ఆర్జేడీకి బాధ్యతలు - ఇక డిప్యూటీ డీఈవోల వంతు! విద్యారణ్యపురి : టీచర్ల బదిలీల్లో అక్రమాల వ్యవహారంపై సర్కారు స్పందిం చింది. జిల్లా విద్యాశాఖాధికారి వై.చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బదిలీల్లో అక్రమాలపై సమగ్ర విచారణ నేపథ్యంలో చంద్రమోహన్ వరంగల్ నగరం విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్యకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ జరిగింది.. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నియోజకవర్గంలోని పలుచోట్ల టీచర్ల అక్రమ బదిలీలు జరిగాయని జాబితాతో సహా వచ్చి డీఈవోను నిలదీశారు. విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పిర్యాదు చేశారు. జిల్లాలోని టీచర్ల బదిలీల అక్రమాలపై ఫిర్యాదుల అంశాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు.. అడిషనల్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. సత్యనారాయణరెడ్డి ఈనెల 29న డీఈవో కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. ఆరోపణలపై సంబంధిత టీచర్ల ఆప్షన్ల ఫారాలు పరిశీలించారు. ప్రధానంగా ఒక్కసారి టీచర్లను బదిలీ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో మాడిఫికేషన్ చేయకూడదు. డీఈవో చంద్రమోహన్ పలువురి టీచర్లకు ఇలా మాడిఫికేషన్ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పలుచోట్ల టీచర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్టైటిల్పాయింట్లు పొంది బదిలీ చేయించుకున్నారని తేలింది. ఇలా బదిలీల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా జిల్లాలో టీచర్ల బదిలీల్లో అనేక రకాలుగా అక్రమాలు చోటుచేసుకోవడం, ముడుపులు తీసుకొనే అవకతకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సత్యనారాయణరెడ్డి విచారణ నివేదికను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ అందజేశారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరిగాయనేది వెల్లడికావడంతో డీఈవో చంద్రమోహన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా డీఈవో చంద్రమోహన్‌ను సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని తెలుస్తోంది. కాగా, చంద్రమోహన్ వరంగల్ డీఈవోగా 2014 నవంబర్ 18న బాధ్యతలను స్వీకరించారు. 8 నెలల 14 రోజులు బాధ్యతలు నిర్వర్తించి సస్పెండ్ అయ్యారు. ఆర్జేడీ బాలయ్యకు అదనపు బాధ్యతలు వరంగల్‌లోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్యకు ఇన్చార్జి జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కార్యాలయం నుంచి సమాచారం బాలయ్యకు అందజేశారు. బాలయ్య ఖమ్మం జిల్లా గార్లబయ్యారం ప్రాంతానికి చెందిన వారు. గత రెండేళ్లగా వరంగల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా పని చేస్తున్నారు. మూడురోజుల క్రితమే ఖమ్మం డీఈవోగా పని చేస్తున్న రవీందర్‌రెడ్డిని ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసింది. బాలయ్యకు ఖమ్మం జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించింది. బాలయ్య ఈ నెల 3న ఖమ్మం డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా వరంగల్ జిల్లా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. బాలయ్య రెండు జిల్లాల బాధ్యతలను నిర్వర్తించడం ప్రస్తుత పరిస్థితులో ఇబ్బందికరంగానే ఉండనుంది. వరంగల్‌కు పూర్తిస్థాయి డీఈవోగా ఎవరు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాజేష్, రాజీవ్, లక్ష్మిబాయిలలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక డిప్యూటీ డీఈవోల వంతు! టీచర్ల బదిలీల అక్రమాలల్లో డిప్యూటీ డీఈవోల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డిప్యూటీ డీఈవోలపై పలు ఉపాధ్యాయ సంఘాలు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే బాధ్యులైన డిప్యూటీ డీఈవోలపైనా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ముగ్గురు డిప్యూటీ డీఈవోలపై ఆరోపణలున్నాయి. మరోవైపు కలెక్టర్ వాకాటి కరణ టీచర్ల బదిలీల అక్రమాల వ్యవహారంపై విచారణకు ఏజేసీ తిరుపతిరావు నియమించటంతో ఇక అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగబోతుంది. విద్యాశాఖాధికారితోపాటు డిప్యూటీ డీఈవోల పాత్ర కూడా ఇందులో వెలుగులోకి రానుందని భావిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన టీచర్లు, సరిగా స్రూట్నీని చేయని ఇన్చార్జి ఎంఈవోలపాత్రపైనా విచారణ జరిగే అవకాశం ఉంది. -
దొడ్డిదారిన టీచర్ల బదిలీలు
కౌన్సెలింగ్ ప్రక్రియకు మంగళం ? ప్రజా ప్రతినిధుల సిఫారసులతో బదిలీలకు శ్రీకారం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయుల పేర్లతో జాబితా పరిశీలన కోసం డీఈవోకు పంపిన విద్యాశాఖ డెరైక్టరేట్ ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి అన్యాయం గుంటూరు ఎడ్యుకేషన్ :టీచర్లను దొడ్డిదారిన బదిలీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసింది. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో చేయాల్సిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ఏడాదిగా చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సౌలభ్యంగా ఉండే ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు.కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కోసం రాజకీయ పలుకుబడి కలిగిన టీచర్లు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు పొంది సీఎం పేషీకి క్యూ కడుతున్నారు. ఉపాధ్యాయులు సమర్పించిన సిఫార్సు లేఖలను సీఎం పేషీ అధికారులు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు పంపుతున్నారు.సీఎం పేషీ ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులను నేరుగా బదిలీ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు ఆయా టీచర్ల జాబితా పుంపుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కొంత కాలంగా ఈ తంతు నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంపాలని ఓ జాబితాను డీఈవోకు పంపారు. జిల్లా నుంచి బదిలీకి దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యేల సిఫార్సులతో వెళ్లిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, బదిలీకి అర్హులా, కాదా అని నిర్ధారించి నివేదిక పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోకు సమాచారం పంపారు. ఉపాధ్యాయులను అక్రమ మార్గంలో బదిలీ చేసే పద్ధతికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్వయానా సీఎం ప్రకటించినా అదే ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిలో బదిలీలకు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించాల్సిన బదిలీల ప్రక్రియను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటున్న కారణంగా సీనియార్టీ కలిగి, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు పంపుతున్నాం ... పాఠశాలల్లో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై క్షేత్ర స్థాయిలో విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి వివరాలు అడిగారు. జిల్లాలో ఏఏ పాఠశాలల్లో ఖాళీలున్నదీ ఎంఈవో, డీవైఈవోల నుంచి సమాచారం సేకరించి ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు పంపుతున్నాం. - డి. ఆంజనేయులు, డీఈవో