సాక్షి, అమరావతి: అంతర్ జిల్లా టీచర్ల బదిలీల నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ఆ జిల్లాలో ప్రస్తుత కేడర్‌లో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండాలన్న నిబంధనుంది.
అయితే టీచర్ సంఘాల అభ్యర్థన మేరకు కేడర్‌తో సంబంధం లేకుండా ఆయా జిల్లాల్లో నియామకమై 2021 జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే చాలని నిబంధనను సవరించారు. దీనిని అనుసరించి టీచర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో రెండేళ్లు ఉంటే చాలు
Published Fri, Jul 2 2021 3:23 AM | Last Updated on Fri, Jul 2 2021 3:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment