పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు | New Guidelines for Work Adjustment in Government Schools: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

Published Mon, Aug 19 2024 6:03 AM | Last Updated on Mon, Aug 19 2024 6:03 AM

New Guidelines for Work Adjustment in Government Schools: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదివారం మార్గదర్శకాలిచ్చింది. ఇప్పటికే రెండు­సార్లు ఈ ప్రక్రియ చేపట్టాలని మార్గదర్శకాలి­చ్చి­నా ప్రభుత్వ షరతులకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. దీంతో 14న మరోసారి పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌రామరాజు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. నేతలు తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. ఇందులో జీవో నం.117 రద్దు మినహా మిగిలిన వాటికి అంగీకరించారు. దీనిప్రకారమే ఆదివారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో క్యాడర్‌ సీనియారిటీ పరంగా జూనియర్‌ను మిగులుగా గుర్తిస్తారు. సీనియర్‌ ఉపాధ్యాయుడి అంగీకారంతో మిగులు ఉపాధ్యాయుల స్థానంలో పని సర్దుబాటుకు సిద్ధంగా ఉంటే వారికి అవకాశమిస్తారు. క్యాడర్‌ సీనియారిటీని లెక్కించేం­దుకు ఒకే డీఎస్సీ, మెరిట్‌–కమ్‌–రోస్టర్‌లో ఉన్న టీచర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీల్లో సబ్జెక్ట్‌ టీచర్‌ లేదా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ లేని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పని సర్దుబాటు ప్రక్రియ  9వ తేదీ నాటికి యూడైస్‌లో నమోదైన డేటా ఆధారంగా నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement