ముగ్గురు డిప్యూటీ డీఈవోలపై వేటు
- ఇప్పటికే డీఈవో చంద్రమోహన్ సస్పెన్షన్
- టీచర్ల బదిలీల్లో అక్రమాల ఫలితం
- పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీ
- పూర్తిస్థాయిలో విచారణ అనంతరం చర్యలు
విద్యారణ్యపురి : ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరగడం, వీటి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు డిప్యూటీ డీఈఓలపై వేటు పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ బాలయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తిని కరీంనగర్ డైట్ కళాశాలకు.. డీఈవో కార్యాలయంలోరాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) డిప్యూటీ డీఈవో అబ్దుల్‌హైని, మహబూబాబాద్ డిప్యూటీ డీఈవో రవీందర్‌రెడ్డిని ఆదిలాబాద్ డైట్ కళాశాలకు బదిలీ చేశారు.
వీరిని హన్మకొండ డైట్ కళాశాల నుంచి కూడా రిలీవ్ చేశారు. మంగళవారం డిప్యూటీ డీఈవోలను విధుల నుంచి తొలగిస్తూ ఆర్‌జేడీబాలయ్య ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. బుధవారం ఆ ముగ్గురిపైనే బదిలీ వేటు వేశారు. ఇప్పటికే డీఈఓ చంద్రమోహన్‌పై వేటు పడిన విషయం తెలిసిందే.
పూర్తిస్థాయిలో విచారణ
హన్మకొండ డైట్ కళాశాలలో లెక్చరర్లుగా పని చేస్తున్న ఆ ముగ్గురు డిప్యూటేషన్‌పై కొన్నేళ్లుగా జిల్లాలో డిప్యూటీ డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే నెపంతో వీరిపై బదిలీ వేటు పడింది. తరుపరి విచారణ అనంతరం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారం విద్యాశాఖను కుదిపేస్తోంది. కలెక్టర్ విచారణ అధికారిగా నియమించిన జేసీ తిరుపతిరావు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ విచారణలో అక్రమాలు పూర్తిస్థాయిలో వెలుగుచూసే అవకాశం ఉంది. సీనియూరిటీ వచ్చాక ఎన్‌టైటిల్‌మెంటు పాయింట్లు అధికంగా వేయించుకోవడం, సీనియూరిటీ జాబితాలో సీరియల్ నంబర్‌లో మార్పులు చేసి బై నంబర్లు వేయించుకుని సంతకాలు చేయించుకోవడం, ముందు ఖాళీలు చూపకుండా తమకు అనుకూలమైన వారికి తర్వాత చూపించి వాటిని భర్తీ చేయడం, టీచర్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి బదిలీ చేయించుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో విచారణ సాగుతోంది. కాగా, పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఎవరి పాత్ర ఎంత అనేది తేలనుంది. ఈనెల 6న డిప్యూటీ డీఈఓలను సస్పెండ్ చేయాలని కూడా టీఎస్ ఓ ఉపాధ్యాయ సంఘం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించబోతుంది.
బదిలీ అయి జాయిన్‌కాకుండా తిరుగుతున్న కొందరు టీచర్లు
టీచర్ల బదిలీల సందర్భంగా కొందరు టీచర్లకు తా ము అనుకున్నచోటికి బదిలీ కాలేదు. గతంలో మం చి ప్లేస్‌లో ఉండి.. పక్షం రోజుల క్రితం సూదర మం డలాలకు బదిలీకావడంతో వారు బదిలీ అయిన పా ఠశాలలకు వెళ్లకుండా మాడిఫికేషన్ కోసం హన్మకొండలోని డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పలువురు బదిలీల సందర్భంగా కౌన్సెలిం గ్‌కు హాజరుకాకుంటే చివరికి మిగిలిన వేకన్సీ పోస్టులలో ఎక్కడో ఒక చోటికి బదిలీ చేసి ఉత్తర్వులు ఇస్తారు.
అలా కొన్ని ఉత్తర్వులు ఇంకా డీఈవో కా ర్యాలయంలో ఉండగా వారికి సమాచారం ఇస్తే వ చ్చి మాకు అక్కడికి పోవటం ఇబ్బందిగా ఉం టుందని మాడిఫికేషన్ చేస్తారా అని కూడా అడుగు తూ జాయిన్‌కాకుండా ఉంటున్నారు. వీరిపై చర్య లు ఏవి అనేది చర్చగా ఉంది. ఒక్కరోజు పాఠశాలకు గైర్హాజరైతేనే తనిఖీలో వెల్లడియితే ఆయా టీచర్లను సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయి. జాయిన్‌కాని టీచర్ల జాబితా రూపొందించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతోంది.