
విశాఖపట్నం: వెంకటేష్ వలంటీర్‌గా పనిచేస్తున్నాడనే సంగతి తమకు తెలియదని జీవీఎంసీ 95వ వార్డు సుజాతనగర్‌లోని 80 ఫీట్ రోడ్డులో ఇటీవల హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి తెలిపారు. వరలక్ష్మిని వలంటీర్ వెంకటేష్ హత్య చేశాడని పదేపదే కూస్తున్న ఎల్లో మీడియాతోపాటు కొన్ని అనుబంధ మీడియా సంస్థలకు కనువిప్పు కలిగే నిజాలను ఆయన తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ... గత నెల 31న సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో వృద్ధురాలు వరలక్ష్మి హత్య జరిగిన విషయం తెలిసిందే.
ఆమె భర్త, కుమారుడు నడుపుతున్న మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేసే వెంకటేష్ వృద్ధురాలిని హత్య చేశాడు. అయితే వెంకటేష్ వలంటీర్ అని ఎల్లో మీడియాతోపాటు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కొద్ది రోజుల క్రితమే వెంకటేష్‌ని వలంటీర్‌గా తొలగించామని జీవీఎంసీ జోన్ – 8 కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. అయినప్పటికీ పదేపదే వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం, గత శుక్రవారం సుజాతనగర్‌లోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించిన క్రమంలో మృతురాలి భర్త గోపాలకృష్ణమూర్తి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అసలు వెంకటేష్ తమ ఏరియాకి... తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చే వలంటీర్ కాదని, అతను వలంటీర్ అన్న విషయమే తనకు తెలియదంటున్నారు. తమ ఇంటికి వచ్చే వలంటీర్ విజయలక్ష్మి అని, ఆమె సమయానికి సమాచారం, పింఛన్ల నగదు అందిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment