Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! | Volunteer Jobs in Telangana | Sakshi
Sakshi News home page

Volunteer Jobs in Telangana: ఏపీ బాటలో తెలంగాణ! వలంటీర్‌ల నియామకాలు.. వివ‌రాలు ఇవే

Published Fri, Jan 5 2024 3:22 PM | Last Updated on Fri, Jan 5 2024 6:48 PM

Volunteer Jobs in Telangana - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు వలంటీర్ల వ్య‌వస్థ‌ను ప్ర‌వేశ‌పెట్టి.. విజ‌య‌వంతంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా.. వలంటీర్ల వ్య‌వస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. ఈ మేర‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో దాదాపు 80,000 వాలంటీర్ ఉద్యోగాలు నియామకం చేపట్టనున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది  ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. 

ఆరు గ్యారెంటీలకు వాలంటీర్ల వ్య‌వస్థ ఎంతో ఉప‌యోగం..
ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. అలాగే ఆరు గ్యారెంటీల అమ‌లుకు వాలంటీర్ల వ్య‌వస్థ ఎంతో ఉప‌యోగంగా ఉంటుంది.

దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80 వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది.

ఇక‌ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఇక తెలంగాణ‌లో కొత్త‌గా రానున్న‌ వలంటీర్లకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి కూడా దాదాపు రూ.5000 నుంచి రూ.10,000 మ‌ధ్యలో ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఇదీ చదవండి: లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్‌ కావొద్దు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement