
సాక్షి, విశాఖపట్నం: నిత్యం ప్రభుత్వాన్ని నిందించడమే పవన్ కల్యాణ్ పనా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీ నాయకునిగా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పాలి కానీ ప్రతిసారీ సీఎంను విమర్శించడమే పనిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.పవన్ తీరు మార్చుకోకుంటే ప్రజలే చెప్పులు చూపిస్తారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కాకి లెక్కలను ప్రజలను విశ్వసించరని అన్నారు. ఎన్సీపీ, ఎన్సీఆర్‌బీకి తేడా తెలియని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సైకోలా మాట్లాడుతున్నాడని, ఆయన హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
‘వాలంటీర్లపై పవన్ మాట్లాడిన తీరు బాధాకరం. వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉన్నారు. వాలంటీర్లపై నిందలు వేయడానికి పవన్‌కు బుద్ధి ఉందా? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశారు. వాలంటీర్లు పవన్ క్షమాపణలు చెప్పాలి. పదేళ్లైనా పవన్ రాజకీయాల్లో ఎదగలేదు. అవసరాలకు తల్లి, రాజకీయాల కోసం భార్య పేరు ఉపయోగిస్తున్నారు. పవన్ తల్లిని అవమానించింది టీడీపీ నేతలే కదా. వారిని కాకుండా మమ్మల్ని విమర్శించడం దేనికి?. వైఎస్సార్ సీపీ నాయకులు ఎప్పుడైనా మీ తల్లి, భార్య గురించి మాట్లాడారా?
కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. పవన్ ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదు. జనసేన పార్టీ ఎందుకు. డబ్బులు తీసుకొని ఖర్చు చేయడం ఎందుకు. టీడీపీలో విలీనం చేసేయొచ్చు కదా? విలీనం చేస్తే విడతలుగా డబ్బు రాదని ఆలోచిస్తున్నావా ? ‘వారాహి పార్ట్ 2లో భాగంగా పొలిటికల్ సైడ్ హీరో రాజకీయాలు మాట్లాడారు. సంసారం గురించి ఓ తిరుగుబోతు మాట్లాడినట్లు పవన్ మాట్లాడారు. పవన్‌ను చూసి అమ్మాయిలు భయపడుతున్నారు. మీకు ధైర్యం వుంటే అమ్మ ఒడి, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు చెప్పగలవా’ అని ప్రశ్నించారు.
చదవండి: ప్రశ్నిస్తే బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment