స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అని అక్షరాలను రాస్తున్న వలంటీర్ రేణుక
పెయింట్‌తో ప్రమాద సూచిక ఏర్పాటు
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్‌పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్‌తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment