ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్‌రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్‌రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
లైష్‌రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్‌లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.
జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
Comments
Please login to add a commentAdd a comment