ఇస్లామాబాద్: పాకిస్తాన్, రష్యా సైనికాధికారులు సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు.
పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరుదేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. తమను బ్రిక్స్‌లో భాగం చేయాలని పాకిస్తాన్ రష్యాకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ఆహ్వానం రాకపోవడం గమనార్హం. భారత్ వ్యతిరేకత కారణంగా బ్రిక్స్‌లో పాకిస్తాన్‌కు సభ్యత్వం కల్పించలేదు.
ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
Comments
Please login to add a commentAdd a comment